Abdul Javidtadipalle

ముస్లిం మైనార్టీల సమస్యల పై సజ్జల రామకృష్ణా రెడ్డికి వినతి పత్రం

తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేసిన ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల ముఖ్యమైన సమస్యలను వివరిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ని కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళమని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించి రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించడంలో జగన్మోహన్ రెడ్డి ముందుంటారని భరోసా కల్పించారు. ముస్లిం మైనార్టీల ప్రతి సమస్యపై సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Back to top button
Enable Notifications    OK No thanks