Dharmavaram

ధర్మవరం ప్రెస్ క్లబ్ లో జరిగిన ఘటన చాలా బాధాకరం

  • ధర్మవరం ప్రెస్ క్లబ్ లో జరిగిన ఘటన చాలా బాధాకరం
  • ఈ సంఘటనను ప్రెస్ క్లబ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాము
  • ధర్మవరం ప్రెస్ క్లబ్ లో జరిగిన ఘటన చాలా బాధాకరం
  • ధర్మవరం ప్రెస్ క్లబ్ కమిటీ

ధర్మవరం (పల్లెవెలుగు) జూన్ 28 : ధర్మవరం ప్రెస్ క్లబ్ తరపున అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయడమేమనగా ప్రెస్ క్లబ్ కమిటీ అన్ని రాజకీయ పార్టీ నాయకుల వార్తలు , ప్రోగ్రాంలు కవర్ చేస్తూ అన్ని పార్టీలను సమానంగా చూస్తున్నాము . అలాంటి మా ప్రెస్ క్లబ్ ను అన్ని రాజకీయ పార్టీల నాయకులు గౌరవిస్తున్నారు సంతోషం కానీ మంగళవారం ఉదయం ప్రెస్ క్లబ్ లోకి పాత్రికేయుల సమావేశం నిర్వహించడానికి వచ్చిన వారిపై దాడులు చేయడం సబబు కాదని మీలో మీకు ఉండే అంతర్గత విభేదాలు, కక్ష్యలు, కార్పన్యాలు ఉంటే బయట చూసుకోవాలే తప్ప ప్రెస్ క్లబ్ లో ఇలాంటి ఘటనలకు పాల్పడడం ప్రెస్ క్లబ్ లో జరగడం మాకు చాలా బాధాకరమైన విషయం అని కమిటీ పెద్దలు తీవ్రంగా ఖండించారు. మాకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అన్ని ప్రజా సంఘాలు మాకు సమా నమే అన్నారు . మా ప్రెస్ క్లబ్కు దాతలు ఇచ్చిన ఫర్నిచర్ను ధ్వంసం చేయ డాన్ని ఇలాంటి ఘటనలను ప్రెస్ క్లబ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్ని రాజకీయ పార్టీల నాయ కులకు మా ప్రెస్ క్లబ్ కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము అన్నారు.

Back to top button