Dharmavaram

అమ్మఒడి పథకానికి సరి అయిన సమాచారాన్ని కచ్చితంగా ఇవ్వండి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున

అమ్మఒడి పథకానికి సరి అయిన సమాచారాన్ని కచ్చితంగా ఇవ్వండి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున

ధర్మవరం (ఆంధ్రప్రతిభ) 10 జూన్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అమ్మఒడి పథకానికి సంబంధించిన కుటుంబ సభ్యులు విద్యార్థుల యొక్క సమాచారాన్ని ఇచ్చి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో అమ్మఒడి పథకానికి 19,594 మంది అప్డేట్ అయ్యారని, ఇందులో నాలుగు వేల మందికి రి వెరిఫికేషన్ లో ఉన్నారని తెలిపారు.  సచివాలయ ఉద్యోగులు విచారణ చేపడుతున్నారని, దానికి సంబంధించిన కొంత సమాచారం సరిగా రావడం లేదని తెలిపారు. అందుకే సచివాలయ ఉద్యోగస్తులు ప్రజల వద్దకే వెళ్లి అమ్మ ఒడి పథకం వచ్చిందా? లేదా? ఎందుకు? అన్న కారణాలపై విచారణ చేస్తూ ,సమస్య పరిష్కరిస్తారని తెలిపారు. వాలంటీర్ ల వద్ద కొంతమందికి వేలి ముద్ర రావటం లేదని, ఇల్లు మారిన వారు, వేరే గ్రామాలకు వెళ్ళినవారు సమాచారము సచివాలయంలో అందజేస్తే తప్పక అమ్మఒడి పథకం వర్తిస్తుందని తెలిపారు. కావున తల్లిదండ్రులు అపోహలకు పోకుండా, ఖచ్చితమైన సమాచారాన్ని సచివాలయాల్లో ఇవ్వాలని తెలిపారు.

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button
Enable Notifications    OK No thanks