
L1 L2 L3 ప్రజలకు ముఖ్య గమనిక
L1 L2 L3 ప్రజలకు ముఖ్య గమనిక
ధర్మవరం,మే 07;(పల్లె వెలుగు):రైల్వే అండర్ బ్రిడ్జ్ మరమ్మత్తులు చేపడుతున్న నేపథ్యంలో ధర్మవరం తహసీల్దార్ నీలకంఠారెడ్డి పత్రికా ప్రకటన ద్వారా తెలుపుతూ ధర్మవరం పట్టణం లోని కేతిరెడ్డి కాలనీ,L1, L2, L3 మరియు L4 ,కాలనీలు, ఇందిరమ్మ మరియు వైస్సార్ కాలని ప్రజలకు కేతిరెడ్డి కాలనీ నుండి L1 L2, L3 కాలనీ ప్రజలు వెళ్ళు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ని ఈనెల 9వ తేది నుండి దాదాపుగా 3వారాల పాటు మరమ్మతులు జరుగుతున్నందున ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ని తాత్కాలికముగా మూసివేయడము జరుగుతుందనీ, కావున ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీ, L1, 12, L3 మరియు L4కాలనీలు, ఇందిరమ్మ మరియు వైస్సార్ కాలని మరియు పరిసర ప్రాంతాల ప్రజలు గమనించి అందు బాటులో ఉన్న ప్యాదిండి ఆంజనేయ స్వామి గుడి దగ్గర గల అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ని రాకపోకలకు వినియోగించు కోవలసినది గా తెలిపారు.