
జనసేన రైతు భరోసా యాత్రను విజయవంతం చేయండి
- జనసేన రైతు భరోసా యాత్రను విజయవంతం చేయండి
- జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
ధర్మవరం (పల్లె వెలుగు) ఆంధ్రప్రదేశ్లో లో రైతులు అప్పుల బాధ లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించడానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు ధర్మవరం నకు రావడం జరుగుతోందని, ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని,విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వారి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత వైయస్సార్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని, రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉండటం దురదృష్టకరమన్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ కౌలు రైతుల దయనీయ పరిస్థితిని గుర్తించి, ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న దృఢసంకల్పంతో ధర్మవరం రానున్నారని తెలిపారు. కావున వారి పర్యటనను విజయవంతం చేసేలా, అందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ పట్టణ నాయకులు అడ్డ గిరిశ్యామ్ కుమార్,మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, మండల అధ్యక్షులు శివ ప్రసాద్, ఈశ్వర్ ,జయరామ్, క్రాంతికుమార్, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు సతీష్ కుమార్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.