
ప్రజల అండదండలు ఉండేంత వరకు సేవలు కొనసాగిస్తాను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
ప్రజల అండదండలు ఉండేంత వరకు సేవలు కొనసాగిస్తాను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
ధర్మవరం (పల్లె వెలుగు) 08 ఏప్రిల్: ధర్మవరం నియోజకవర్గ ప్రజల యొక్క అండదండలు ఉండే ఇంతవరకూ నా సేవలు కొనసాగిస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణములోని సియన్ బి కళ్యాణ మండపంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వార్డు వాలంటీర్ల సేవలకు.. పురస్కారాల ప్రదానోత్సవ సభ కు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత జ్యోతి ప్రజ్వలన గావించి సభను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, స్థానిక తహసిల్దార్ నీలకంఠ రెడ్డిలు వాలంటీర్లు యొక్క సేవలను కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో గ్రామములో గాని పట్టణములో గాని వాలంటీర్ల యొక్క బాధ్యతలు విశేష సేవలతో కూడుకున్న పని, వీరి సేవలు నేరుగా ప్రజల వద్దకు వెళ్లేలా చేస్తున్న వీరి పనితీరు పట్ల వారు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వాలంటీర్స్ ప్రభుత్వం యొక్క పథకాలను నేరుగా ప్రజల వద్దకు చేర్చడం జరుగుతోందని, ఇందుకు వారు సెలవు దినాలు కూడా లెక్కచేయకుండా ఉదయం నుండి రాత్రి వరకు సేవా భావంతో పని చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం అని వారు తెలిపారు. కరోనా సమయంలో వీరి సేవలను వెలకట్టలేనివని,ఎంతో మందికి కరోనా పై అవగాహన కల్పించి ప్రాణదాతలు అయ్యారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అమలు పరచడంలో అదేవిధంగా లబ్ధిదారులకు అందించడంలో వాలంటరీ సేవ లు మరుపురాని వాని వారు తెలిపారు. ఇకనుంచి నిరంతర బాధ్యతను మరింతగా పెంచుకోవాలని వారు వాలంటీర్లకు పిలుపునిచ్చారు. వాలంటీర్లు చేస్తున్న సేవలను ముఖ్యమంత్రి గుర్తించడం జరిగిందని, ఇందుకు అనుగుణంగా వాలంటీర్ల లో సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రగా విభజించి పది వేల రూపాయలు, 20వేల రూపాయలు, 30 వేల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందన్నారు. దీంతో పాటు సేవలందించిన అందరిని ఎమ్మెల్యేతో పాటు ఎం పీ డీ వో లు మున్సిపల్ కమిషనర్లు శాలువా, మెడల్, ప్రశంసా పత్రము ఇచ్చి ఘనంగా సన్మానించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున మాట్లాడుతూ ధర్మవరం అర్బన్, ధర్మవరం రూరల్, బత్తలపల్లి, ముదిగుబ్బ ,తాడిమర్రి మండలాలలో సేవా వజ్ర లో మొత్తం ఐదు మందికి, అదే విధంగా సేవ రత్న లో 27, మందికి సేవా మిత్ర లో 1182, మొత్తం 1214 మంది ఎంపిక కావడం జరిగిందని వీరందరికీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెడల్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ చైర్మన్ లింగం , వైస్ చైర్మన్ లు చంద మూరి నారాయణ రెడ్డి, మాస పల్లి సాయి కుమార్, ఎంపీపీ గిరక రమాదేవి, వైస్ ఎంపీపీ లు కృష్ణా రెడ్డి, ప్రతాపరెడ్డి, స్థానిక ఎమ్మార్వో నీలకంఠారెడ్డి, నియోజకవర్గ ఎంపీడీవోలు నరేష్ కృష్ణ, దోస రెడ్డి, విజయలక్ష్మి, ఎంపీటి సి లు, వార్డు కౌన్సిలర్ లు, నియోజకవర్గ ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేశారు.