
మెగా జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి ఇన్చార్జ్ జడ్జి. దీన
మెగా జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి ఇన్చార్జ్ జడ్జి. దీన
ధర్మవరం (పల్లె వెలుగు) 08 ఏప్రిల్: ధర్మవరం పట్టణంలోని సీనియర్, జూనియర్ సివిల్ కోర్టులో జూన్ 26వ తేదీన నిర్వహించబడు మెగా జాతీయ లోక్ అదాలత్ ను, న్యాయవాదులు విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జ్ జడ్జి దీన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోర్టు చాంబర్లో జడ్జి న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఈనెల 23వ తేదీన నిర్వహించబడే వర్చువల్ లోక్అదాలత్ కూడా విజయవంతం చేసేలా న్యాయవాదులు కృషి చేయాలని తెలిపారు. న్యాయవాదులు, పోలీసులు సమన్వయంతో అధిక కేసులో రాజి వచ్చేలా చేయాలని తెలిపారు. అవసరమైతే కక్షిదారులకు ఈ లోక్ అదాలత్ పై పూర్తి అవగాహన ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుంటప్ప,ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, బార్ సభ్యులతో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.