DharmavaramAbdul Javid

రక్తదాన శిబిరానికి విశేష స్పందన

రక్తదాన శిబిరానికి విశేష స్పందన

ధర్మవరం (పల్లె వెలుగు) 08 ఏప్రిల్: ధర్మవరం  పట్టణములోని సాయి నగర్ లో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో  మెగా రక్తదాన శిబిరంను గురువారం నిర్వహించారు. ఈ శిబిరంలో 75 మంది స్వచ్ఛందంగా రక్త దాతలు వచ్చి శిబిరము ను విజయవంతం చేశారని శ్రీ షిరిడి సాయి బాబా సేవా సమితి కమిటీ అధ్యక్షులు సూర్యప్రకాష్, కార్యదర్శి రాం ప్రసాద్ పేర్కొన్నారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణదాతలు అయినప్పుడే మానవతా విలువలు గుర్తింపు వస్తాయని తెలిపారు. గర్భిణీలకు తలసేమియా బాధిత పిల్లలకు ఈ శిబిరం అంకితమని వారు తెలిపారు. ప్రతి నెల వారికి వివిధ గ్రూపుల రక్తం అవసరం ఉందని, తమ వంతుగా ఈ శిబిరము ను విజయవంతం చేసిన రక్తదాతల అందరికీ పేరు పేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో దేవాలయ డైరెక్టర్స్ టి సి నారాయణ రెడ్డి, సూర్యనారాయణ, రామలింగయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks