Dharmavaram

కార్పొరేట్ వైద్యాన్ని అర్బన్ హెల్త్ సెంటర్లో అందించడమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

కార్పొరేట్ వైద్యాన్ని అర్బన్ హెల్త్ సెంటర్లో అందించడమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

ధర్మవరం (పల్లె వెలుగు) 08 ఏప్రిల్: కార్పొరేట్ వైద్యాన్ని అర్బన్ హెల్త్ సెంటర్ లో అందించడమే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ధర్మవరం పట్టణంలోని సిద్దయ్య గుట్ట లో 80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ ను వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి  పేద ప్రజలకు అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని లక్ష్యంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ హెల్త్ సెంటర్ ల భవనాన్ని చేపట్టడం నిజంగా సంతోషించదగ్గ విషయం ఇటువంటి కార్యక్రమం పేదలకు ఒక వరంగా మారింది అన్నారు. ఇప్పుడు ధర్మవరంలో మొత్తము 6 అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రజలకు అంకితం చేయడం గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్య చికిత్సతో పాటు రక్త పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైద్య శాఖలో 30 వేల పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. విద్యకు వైద్యానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయడం లేదని వారు గర్వంగా తెలిపారు. ప్రసూతి సౌకర్యాలను కూడా ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. వైద్యులు కూడా బాధ్యతగా తమ విధులను  నిర్వర్తించిన అప్పుడే అర్బన్ హెల్త్ సెంటర్ లకు మంచి గుర్తింపు లభించడం ఖాయమన్నారు. తదుపరి వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహిస్తూ వైద్యులు సమయపాలన పాటించి రోగుల పట్ల ప్రేమతో పెరిగి మంచి వైద్యం అందించాలని వారు కోరారు. తదుపరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్యులు ఎమ్మెల్యే చే కేకును కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లింగం నిర్మల, వైస్ చైర్మన్ లు చంద మూరి నారాయణ రెడ్డి, మాస పల్లి సాయి కుమార్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు ఉడుముల రామచంద్ర, సుభాన్ భాష తదితరులు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button