
విధులు సక్రమంగా నిర్వహిస్తే, మంచి గుర్తింపు లభిస్తుంది శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్
విధులు సక్రమంగా నిర్వహిస్తే, మంచి గుర్తింపు లభిస్తుంది శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్
ధర్మవరం( పల్లె వెలుగు) ధర్మవరం టౌన్ పోలీస్ స్టేషన్ లలో విధులు సక్రమంగా నిర్వహిస్తే మంచి గుర్తింపు లభిస్తుందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం వారు డి ఎస్ పి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అనంతరం డిఎస్పీ రమాకాంత తో డివిజన్ యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలో సిబ్బంది వివరాలు, కేసుల వివరాలు తదితర విషయాలను వారు పరిశీలించారు. అనంతరం మార్కెట్ యార్డులో రూరల్ పోలీస్ స్టేషన్ యొక్క ఏర్పాట్లు, ప్రస్తుత భవనము యొక్క పరిస్థితిని పరిశీలిం చారు. డివిజన్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసిన వారందరికీ కూడా చట్ట ప్రకారం న్యాయం చేయాలని డీఎస్పీకి సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ కరుణాకర్ రూరల్ సిఐ మన్సురుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.