
జాతీయ హాకీ అంపైర్ గా స్నేహాలత
జాతీయ హాకీ అంపైర్ గా స్నేహాలత
ధర్మవరం,మార్చి 19;(పల్లెవెలుగు):అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల కు చెందిన స్నేహాలత ఈ నెల 23 వతేదీనుంది 10 రోజులపాటు కాకినాడ లో జరుగుతున్న జాతీయ మహిళా జూనియర్ హాకీ టోర్నమెంట్ కు అంపైర్ గా వ్యవహరించనున్నారు.జిల్లానుంచి తన హాకీ క్రీడా జీవితాన్ని మొదలు పెట్టి సబ్ జూనియర్,జూనియర్,సీనియర్ నేషనల్స్ లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు . స్నేహాలత తండ్రి జయచంద్రా రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ కుమార్తె చదువులోను,హాకీ లోను ప్రోత్సహిస్తూ వచ్చారు ప్రస్తుతం అనంతపురం ఆర్ .డి. టీ అకాడమీ లో శిక్షణ పొందుతున్నారు.ఆమె ప్రతిభ ను గుర్తించి హాకీ ఆంద్రప్రదేశ్ సెక్రటరీ హర్షవర్ధన్ అవకాశం కల్పించారు.నేషనల్స్ అంపైర్ గా ఎన్నికకావడం పట్ల జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి సూర్యప్రకాష్ సంతోషం వ్యక్తంచేశారు.నేషనల్ అంపైర్ గా అవకాశం కల్పించిన హాకీ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి హర్షవర్ధన్ కు హాకీ అనంతపురం తరపున సూర్యప్రకాష్ ధన్యవాదాలు తెలియజేసారు