
బాల్య వివాహాలు జరగకుండా చర్యలు కఠినంగా చేపట్టండి -తహశీల్దార్ నీల కంఠారెడ్డి
బాల్య వివాహాలు జరగకుండా చర్యలు కఠినంగా చేపట్టండి -తహశీల్దార్ నీల కంఠారెడ్డి
ధర్మవరం, మార్చి 19 (పల్లెవెలుగు): మండల డివిజన్ పరిధిలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరగకుండా చర్యలు కఠినంగా చేపట్టాలని చైర్మన్ ,తహశీల్దార్ నీల కంఠారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గా స్థానిక ఎన్జీవో హోంలో అంగన్వాడి టీచర్లకు, మహిళ సంరక్షణ కార్యకర్తలు, వీఆర్వోలు ,పంచాయతీ కార్యదర్శులకు బాల్య వివాహాల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహనా సదస్సుకు సిడిపిఓ వరలక్ష్మి, ఈవో ఆర్ డి శంకర నారాయణ రెడ్డి, వెలుగు ఏపీఎం లక్ష్మీనారాయణ, డాక్టర్ సుష్మ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ కోఆర్డినేటర్ ఆదినారాయణ, జిల్లా చైల్డ్ కోఆర్డినేటర్ కృష్ణమాచారి, మండల చైల్డ్ డివిజన్ కోఆర్డినేటర్ చంద్రమోహన్, ఆర్ డి టి.. ఏ టి ఎల్ తో పాటు ఐసీడీఎస్ సూపర్వైజర్లు జయంతి, లతా కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీల కంఠారెడ్డి మాట్లాడుతూ మండల స్థాయిలో బాల్యవివాహాల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బాల్య వివాహాల నిరోధక చట్టాల పై అవగాహనను పూర్తిగా వివరించారు. మండల స్థాయి కమిటీలు పటిష్టంగా పని చేయాలన్నారు. ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో కానీ తల్లిదండ్రులకు బాల్య వివాహాల పై తప్పక అవగాహన కల్పించాలని తెలిపారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగినచోట తప్పక సంబంధిత అధికారులు ,సిబ్బంది వెళ్లాలే తప్ప ,నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.