Dharmavaram

‘అనంత’లో….’ఆ..నలుగురు!

‘అనంత’లో….’ఆ..నలుగురు!

  • కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కేదెవరికి?
  • అంతుచిక్కని జగన్ ‘స్ట్రాటజీ’

ధర్మవరం (పల్లెవెలుగు) 15 మర్చి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టబోతున్న కేబినేట్ విస్తరణలో అనంతపురం జిల్లా నుండీ మంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన శంకర నారాయణ జిల్లా నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఊహించని విధంగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శంకర నారాయణకు మంత్రి పదవి దక్కడం అప్పట్లో రాజకీయ నాయకులకు ఆశ్చర్యచకితుల్ని చేసింది.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత ఏర్పాటు చేసిన కేబినెట్ లో మంత్రి పదవి పై అనంతపురం జిల్లానుండీ ముగ్గురి పేర్లు బహిరంగంగా వినిపించాయి. సీనియర్ నాయకులు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్లు వినిపించాయి. అయితే అనూహ్యంగా బీసీ కోటాలో శంకర నారాయణకు మంత్రి పదవి వరించింది.

అయితే ఈసారి జగన్ ఏర్పాటు చేయబోతున్న కేబినెట్ విస్తరణలో మంత్రిగా ఎవరికి అవకాశం లభిస్తుందో ..వేచిచూడాలి.

జగన్ కేబినెట్లో కోటాల మార్పులు యధాతతంగానే ఉంటాయని భావిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా విషయానికొస్తే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారో? ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న!

సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తారా?

సీనియారిటీకి  ప్రాధాన్యత విషయంలో పరిశీలిస్తే అనంతపురం శాసనసభ్యులుగా ఉన్న ఆనంత వెంకటరామిరెడ్డి సీనియర్ నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యులుగా పనిచేశారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహుతులు.

పరిటాల కోటను బద్దలు కొట్టిన ‘తోపు’దూర్తి ప్రకాష్ రెడ్డి కి అవకాశం ఇచ్చేరా?

పట్టువదలని విక్రమార్కుడిలా… అలుపెరుగని పోరాట యోధుడిగా పరిటాల కంచుకోటను బద్దలు కొట్టిన తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి బలమైన ప్రత్యర్థిపై అనేక పర్యాయాలు పోటీచేసి, ఓడిన ప్రతిసారీ మరింత పట్టుదలతో మొక్కవోని దీక్షతో  పరిటాల కుటుంబంపై గెలిచిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి కి మంత్రి పదవి ఇస్తారా?

‘ట్రెండ్ సెట్టర్’ కేతిరెడ్డి కి మంత్రి యోగం కల్పిస్తారా?

  ‘గుడ్ మార్నింగ్’ కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజల్లో వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ, వాటిని పరిష్కరించడమనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి రాజకీయాల్లో ఒక ‘ట్రెండ్ సెట్’ చేసిన ధర్మవరం ఎమ్మెల్యే  కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కి అభిమానులను సంపాదించిపెట్టింది. అంతేకాకుండా ఇటు రాష్ట్రంలోనూ, అటు ప్రక్కరాష్ట్రాల్లో కూడా వైసీపీ పార్టీ పేరు మార్మోగిపోవడం విశేషం.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో వున్నా నిత్యం ప్రజల్లో వుంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడం, తన నియోజకవర్గంలో దీర్ఘకాలిక ప్రయోజనాల కార్యక్రమాలను విజయవంతంగా పూర్తీ చేసుకుంటూ రావడం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రత్యేకత. మరి వైసీపీ పార్టీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సేవల్ని రాష్ట్ర ప్రజలందరికీ అందించడానికి ‘మంత్రి వర్గంలో కేతిరెడ్డికి’ చోటు కల్పిస్తారా?

రిజర్వేషన్ కోటా కింద ‘జొన్నలగడ్డ పద్మావతి’ మంత్రి పదవి ఎగిరేసుకుపోతుందా?

మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోంశాఖను మహిళకు కేటాయించి వైసీపీ మహిళా ప్రాధాన్యతను పెద్దపీట వేస్తుందని చాటిచెప్పారు. అదే క్రమంలో అనంతపురం జిల్లాలో శి0గనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ఎస్సీ రిజర్వేషన్ కోటాలో మంత్రి పదవి దక్కే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిగణలోకి తీసుకుంటారా?

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button
Enable Notifications    OK No thanks