Dharmavaram

మైనారిటీ ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా అత్తార్ రహీం బాషా

మైనారిటీ ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా అత్తార్ రహీం బాషా

ధర్మవరం, మార్చి 14 : (పల్లెవెలుగు) తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ నియో జకవర్గ మైనార్టీ సెల్ ఎక్స్ అఫిషియో అత్తార్ రహీంబాషా ను మెంబరుగా ధర్మవరానికి చెందిన అత్తార్ రహీంబాషాను నియమిస్తూ పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి నుంచి ఉత్తర్వులు అందాయి . పార్టీ బలోపేతానికి కృషి చేసినందుకు తనకు ఈ పదవి అప్పగించారని అత్తార్ రహీంబాషా తెలిపారు . తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి,మైనారిటీల సమస్యల పట్ల పోరాడడానికి కృషి చేస్తానన్నారు. తనను ఎంపిక చేసినందున పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు , ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ , పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి , మాజీ మంత్రి పరిటాల సునీత , ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ కు కృతజ్ఞతలు తెలిపారు

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button