Dharmavaram

దిశ యాప్ పై వార్డు మహిళలకు అవగాహన కల్పించండి -పట్టణ సిఐ కరుణాకర్

దిశ యాప్ పై వార్డు మహిళలకు అవగాహన కల్పించండి -పట్టణ సిఐ కరుణాకర్

ధర్మవరం (పల్లెవెలుగు) మార్చి05: దిశా యాప్ పై వార్డుల్లో మహిళలకు అవగాహన కల్పించాలని పట్టణ సిఐ కరుణాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం పట్టణ పోలీస్ స్టేషన్లో వార్డు మహిళా పోలీసులకు అవగాహన సదస్సు తో పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ కరుణాకర్ మాట్లాడుతూ  తమతమ వార్డులలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ కు తెలియజెప్పాలని తెలిపారు. ప్రతి మహిళకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించి వారికి రక్షణ ఏర్పడుతుందని తెలిపారు. వార్డు లో సీసీ కెమెరాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధను కనపరచండి అని తెలిపారు. బాల్య వివాహాలు, గొడవలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని వారు తెలిపారు. ఈనెల 8వ తేదీ మహిళ దినోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందని, ఆ రోజున మహిళలకు చట్టాలపై ప్రత్యేక అవగాహన వార్డుల్లో కల్పించాలన్నారు.

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button