Dharmavaram

బి.ఎస్.ఆర్ విద్యార్థుల ప్రయోగానికి  ఉపాధ్యాయుల ప్రశంసలు

బి.ఎస్.ఆర్ విద్యార్థుల ప్రయోగానికి  ఉపాధ్యాయుల ప్రశంసలు

ధర్మవరం (పల్లెవెలుగు) ఫిబ్రవరి 28: సైన్స్ డే ను పురస్కరించుకొని పట్టణంలోని స్థానిక బి.ఎస్.ఆర్ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన ‘సైన్స్ ఫెయిర్’ కార్యక్రమంలో   సైన్స్ ప్రాజెక్ట్‌ల  ప్రదర్శనను పాఠశాల పిల్లలు తయారు చేసి ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ‘పర్యావరణ కాలుష్యం’ గురించి భూమి, నీరు, గాలి కలుషితం ఎలా అవుతోంది? వీటివల్ల మానవులు, జంతు, పశుపక్ష్యాదులు వ్యాధుల, మరణాల బారిన పడుతున్నారో ప్రయోగత్మకంగా వివరించిన 9వ తరగతి విద్యార్థినిలు అఖిలాండేశ్వరి, భవాని, ధరణి ఎంతగానో ఆకట్టుకుంది. వీరు చేసిన ప్రయోగాన్ని ఉపాధ్యాయులు ప్రశంసించారు.

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button