
కులాల ,మతాల సంప్రదాయాలను ప్రైవేట్ పాఠశాల, కళాశాలల యాజమాన్యం గౌరవించండి. ఎలాంటి వివాదాలకు తావివ్వకండి- డీఎస్పీ రమాకాంత్
కులాల ,మతాల సంప్రదాయాలను ప్రైవేట్ పాఠశాల, కళాశాలల యాజమాన్యం గౌరవించండి. ఎలాంటి వివాదాలకు తావివ్వకండి- డీఎస్పీ రమాకాంత్
ధర్మవరం (పల్లెవెలుగు) ఫిబ్రవరి 18: కర్ణాటక,ఇతర చోట్ల తలెత్తిన ‘హిజాబ్’వివాదం దృష్టిలో ఉంచుకొని స్థానిక ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపల్, మరియు యాజమాన్యం తో సమావేశం నిర్వహించిన ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ఈ సందర్బంగా డీఎస్పీ రమాకాంత్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశ గొప్పతనమని, దాన్ని కాపాడు కోవడం మన కర్తవ్యం అన్నారు. వివిధ మతాల సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం ముఖ్యం. కర్ణాటక, తదితర ప్రాంతాలలో ‘హిజాబ్’పై వివాదం నడుస్తోందని అలాంటి పరిస్థితి ఇక్కడ తలెత్తకుండా విద్యాసంస్థలు అన్ని మతాల,కులాల సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవిస్తూ విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యానికి సూచించారు. ఎలాంటి మతపరమైన వివాదం తలెత్తినా, విద్యార్థుల చదువులకు ఆటంకం ఎర్పరచినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ కరుణాకర్, పట్టణ ఏఎస్ఐ గౌస్ పీర్, బత్తలపల్లి ఎస్సై శ్రీ హర్ష, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.