Dharmavaram

నిద్రావస్థలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

నిద్రావస్థలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

  • ధర్మవరంలో ప్రభుత్వ అనుమతుల్లేకుండా యథేచ్ఛగా నడుపుతున్న క్లినికల్ లాబొరేటరీలు, క్లినిక్ లు, నర్సింగ్ హోం, ఆసుపత్రులు
  • పరభుత్వ అనుమతులు లేకుండా ప్రజలకు వైద్యం చేస్తున్న క్లినిక్, నర్సింగ్ హోం, ఆస్పత్రులపై చర్యలేవీ?

ధర్మవరం, డిసెంబర్ 15; (పల్లెవెలుగు): ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా క్లినికల్ లాబొరేటరీలు, క్లినిక్ లు, నర్సింగ్ హోం లు నడుపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాచార హక్కు చట్టం కింద జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు గత నెల 22న ఇచ్చిన సమాచారం మేరకు ధర్మవరం పట్టణంలో కేవలం 4 ల్యాబ్ లకు, అదేవిధంగా 15 ప్రయివేటు ఆసుపత్రులకు మాత్రమే అనుమతులున్నాయంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, గడువుతీరైనా రెన్యువల్ చేసుకోకుండా పలు ఆసుపత్రులు, డయాగ్నసిస్ లాబ్ లు ధర్మవరం పట్టణంలో నిర్వహిస్తున్నారని తెలిసినా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం వెనుక ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డారనీ, ఫిర్యాదులు అందితేగాని కుర్చీలో నుండీ కదలరనే విమర్శలు పట్టణంలో ఊపందుకున్నాయి. అదేవిధంగా పట్టణంలోని ఆర్.ఎం.పీ లు నిబంధనలకు వ్యతిరేకంగా వైద్యం చేస్తున్నారన్న విమర్శలూ లేకపోలేదు. కొంతమంది ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు క్లినిక్, నర్సింగ్ హోం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించకుండా తమ ప్రయివేట్ ఆసుపత్రుల్లో అన్నివేళలా అందుబాటులో ఉంటూ వైద్యం చేసుకుంటున్నారని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ అనుమతులు లేకుండా వైద్యం చేయడం ప్రజారోగ్యంతో చెలగాటమే అని, ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖా అధికారులు అనుమతులు లేకుండా నిర్వహిస్తోన్న క్లినికల్ లాబ్, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లపై తనిఖీలు చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button