Dharmavaram

అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవు -మునిసిపల్ కమీషనర్ మల్లికార్జున

అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవు -మునిసిపల్ కమీషనర్ మల్లికార్జున

ధర్మవరం,డిసెంబర్ 04;(పల్లెవెలుగు):  పట్టణంలోని అక్రమ,అనుమతులు లేకుండా నిర్మస్తున్న నిర్మాణాలు, ఆక్రమనలపై మునిసిపల్ కమీషనర్ మల్లికార్జున  పత్రికా ప్రకటన చేశారు. ధర్మవరం పట్టణములో కొంతమంది ఎటువంటి అనుమతులు లేకుండా భవనాలు , ఇల్లు కాలువలు ఆక్రమించుకోవడం నిర్మించడం జరుగుతుంది.రోడ్లు కూడా ఆక్రమించుకొని నిర్మాణాలు చేస్తున్నారని, దీనివల్ల లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు రావడం , మగ్గల గుంతల్లో నీరు రావడం జరుగుతుంది . దీనిని అరికట్టడానికి అనధికార యజమానులపై  భవన అనధికార భవనములు ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ యాక్టు 1965 సెక్షన్ 228 ( 1 ) , ( 2 ) & ( 3 ) మేరకు నోటీసులు జారీచేసినప్పటికీ ఏవైనా నిర్మిస్తున్న, నిర్మించిన భవన యజమానులపై సెక్షన్ 340 మేరకు వారిపై చార్జి షీట్ కోర్టులో ఫైలు చేస్తామని పత్రికా ముఖంగా తెలిపారు.ఈ సెక్షన్ -340 ప్రకారం 3 సం || కారాగార శిక్ష మరియు 10 % ( ఇల్లు + స్థలం విలువలో ) జరిమానా విధించబడుతుందని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ యాక్టు 1965 సెక్షన్ 192 మేరకు మునిసిపల్ కాలువలు మరియు రోడ్లను ఆక్రమించి ఎటువంటి నిర్మాణాలు జరిగిన వాటికి ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగిస్తామని తెలిపారు.

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button