Dharmavaram

పాఠశాల దశ నుంచే విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

అనంతపురం ఆర్డీఓ మధుసూధన్ , మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్

ధర్మవరం, నవంబర్ 28; (పల్లెవెలుగు): పాఠశాల దశనుంచే విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవలని అనంతపురం ఆర్డీఓ మధుసూధన్ , మాజీ ఎమ్మెల్సే డాక్టర్ గేయానండ్ , స్పందన ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ బషీర్లు పేర్కొన్నారు . ఈ సందర్భంగా ఆదివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యములో స్థానిక కాకతీయ విద్యానికేతన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా చెకుముకి సంబరాలను కూడిన పరీక్షలను నిర్వహించారు . జిల్లాలోని 60 మండలాల నుండి 360 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని జెవివి జిల్లా అధ్యక్షుడు ఎస్ . భాస్కర్ , జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు , రాష్ట్ర కార్యదర్శి మహేంద్రరెడ్డిలు పేర్కొన్నారు . అనంతరం ముఖ్యఅతిథులు మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ప్రశ్నించే తత్వాన్ని , శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు . చదివిన సైన్సును పాఠ్యాంశంగా వదలివేయకుండా నిత్యజీవితంలో అన్వయించుకోవాలన్నారు . విద్య సామాజిక స్పృహకు పునాది కావాలన్నారు . రాయలసీమలో ఇంత పెద్దఎత్తున అకాల వర్షాలు పడుతున్నాయని దీనికి వాతావరణంలో మార్పే కారణమన్నారు . భవిష్యత్తులో ఇదేరీతిలో ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రపంచం పెద్దముప్పును ఎదుర్కోవలసి వస్తుందన్నారు . పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా విద్యార్థులుగా మీరు కూడా బాధ్యత కలిగి ఉండాలన్నారు . అనంతరం డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ సైన్స్ చూపిన పరిష్కారమే కోవిడ్ టీకా అని వ్యాక్సిన్ ఆవశ్యకతను వివరించారు . ఈ కార్యక్రమములో ఆత్మీయట్రస్ట్ ఛైర్మెన్ శెట్టిపి జయచంద్రారెడ్డి , కాకతీయ విద్యానికేతన్ డైరెక్టర్ రాజశేఖర్రెడ్డి , జిల్లా కోశాధికారి రామిరెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button