
3వ సారి SFI జిల్లా అధ్యక్షులు గా నామాల నాగార్జున
ధర్మవరం,నవంబర్ 27;(పల్లెవెలుగు) భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ ) 3 దక్షిణ జిల్లా మహాసభలు ఈ నెల 25,26 న పెనుగొండ నగరంలోని శ్రీ పరిటాల రవీంద్ర డిగ్రీ కళాశాలలో ఘనంగా జరిగాయి.ఈ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నాయకత్వం రావడం జరిగింది. ఈ మహాసభలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుని గా నామాల నాగార్జున ను 3వ సారి ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థలును ప్రైవేటు పరం చేసే విధానం వెనక్కి తీసుకోవాలని , జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్ లో నాణ్యమైన భోజనం అందించాలని , గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలని , కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానం మరియు విద్యలో వస్తున్న మార్పులు పై భవిష్యత్తు లో ఉద్యమాలు చేపడతామని నా ఎన్నికకు ప్రత్యక్షంగా ,పరోక్షంగా సహకరించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.