Dharmavaram

అభివృద్ధికి అడ్డుపడతామంటే…ఐ డోంట్ కేర్ -ఎమ్మెల్యే కేతిరెడ్డి

  • ఎన్నుకున్న ప్రజల కోసం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత
  • రైతులతో,వ్యాపారులతో పలుదఫాలు చర్చించాం
  • అసత్య ప్రచారాలు చేసే వారి ‘ట్రాప్’లో పడవద్దు,కూరగాయల వ్యాపారులకు హితవు
  • ఓట్లకోసమో,పదవికోసమో అయితే అభివృద్ధి చేయక్కర్లేదు

ధర్మవరం, (పల్లెవెలుగు) అక్టోబర్24: ధర్మవరం పట్టణంలో  గత మూడు రోజులుగా కూరగాయల మార్కెట్ కు సంబంధించి అక్కడి వ్యాపారుల తాత్కాలిక తరలింపుపై కొంతమంది వ్యాపారులు,ప్రతిపక్షాలు,వామ పక్షాలు చేస్తున్న  ఆరోపణలు,అదేవిధంగా పాత మార్కెట్ స్థానంలో నూతనంగా నిర్మించబోతున్న కూరగాయల మార్కెట్,భవన సముదాయాలు,బాడుగలు, గుడ్ విల్ తదితర అంశాలపై  ఎమ్మెల్యే కేతిరెడ్డి తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ…

ధర్మవరం నియోజక అభివృద్ధిని కాంక్షించి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారనీ, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం తనపై ఉందన్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో ఎలాంటి పరిస్థితి ఉందో ప్రజలకు తెలియనిది కాదు.చిన్నపాటి వర్షం పడినా బురద,దుర్గంధం.వీటి మధ్యనే ప్రజలు,రైతులు,వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతుండటం అందరికీ తెలిసిందే.ఇలాంటి పరిస్థితి దృష్టిలో ఉంచుకొని దీనికి శాశ్వత పరిష్కారం దిశగా,అదేవిధంగా ప్రజలకు,రైతులకు,హోల్ సేల్ వ్యాపారులకు,రిటైల్ వ్యాపారులకు అందరికీ అన్నివిధాల అనుకూలంగా నూతన కాయగూరల మార్కెట్,వాణిజ్య భవన సముదాయం నిర్మించబోతున్నామని,అందుకు సంబంధించి రైతులు, చిరు,మండీ వ్యాపారులతో పలుదఫాలుగా  చర్చలు జరపడం,వారికి అవగాహన కల్పించడం,తాత్కాలికంగా మార్కెట్ తరలింపు పై కూడా వారితో చర్చించడం కూడా జరిగిందన్నారు.

నూతన మార్కెట్ నిర్మాణం పూర్తయ్యేవరకు తాత్కాలికంగా వ్యాపారం చేసుకోడానికి కాలేజి గ్రౌండ్  స్థలం సూచించడం జరిగిందన్నారు.అయితే కొంతమంది వ్యాపారులు అసత్య ప్రచారాలు చేస్తున్న వారి ఉచ్చులో పడడం జరిగిందన్నారు.

పట్టణములోని కాయగూరల మార్కెట్ను అతిత్వరలో అధునాతన రీతిలో కాయగూరల మార్కెట్ వాణిజ్య సముదాయంతో కూడిన భవనాలను నిర్మిస్తున్నట్లు మొత్తం 7.55 కోట్ల రూపాలయలతో ప్రజలకు వ్యాపారస్థులకు అనుకూలంగా ఉండే విధంగా భవన వాణిజ్య సదుపాయాలను కల్పించడము జరుగుతోందన్నారు మొత్తం 146 గదులను నిర్మించడము జరుగుతోందన్నారు పెరుగుతున్న జనాభా, వర్షములో ప్రజలు,రైతులు, వ్యాపారులు పడుతోన్న  ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అన్ని కాలాలలో కూడా  సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించనున్నట్టు తెలిపారు. పరిపాలనా పరంగా , అన్ని విధాలుగా అనుమతులు , ప్రభుత్వం నుండి జి.ఓలు కూడా రావడం జరిగిందన్నారు .8 నెలలలోపు నిర్మాణ పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు . రిటైల్ కూరగాయాలకు 44 దుకాణాలు కలిగిన షెడ్లు వుంటాయనీ వాటికి గుడ్ విల్ ఉండదని నెలవారీ నామ మాత్రపు బాడుగ మాత్రమే ఉంటుందన్నారు . హోల్ సేల్ వ్యాపారుల నిమిత్తం 22 షాపులు , వాణిజ్య షాపులు 78 ఉంటాయన్నారు . మొత్తం ఆరు బ్లాకులలో ఉంటాయన్నారు 146 గదులు ఎస్సీ , ఎస్టీ , రజక , నాయీబ్రాహ్మణ , వికలాంగులకు మొత్తం 36 శాతం రిజర్వేషన్ ప్రకారము , మిగిలిన 64 శాతం ఓపెన్ కేటగిరీలో వ్యాపారస్థులకు గదులు కేటాయించడము జరుగుతుందన్నారు . గుడ్ విల్ లో ఇచ్చే గదులకు 25 సంవత్సరాలు లీజు ఉంటుందనీ,5 సంవత్సరాల వరకు బాడుగ పెంచడం ఉండదని , ఆ తర్వాత చట్టప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు  33 శాతం చొప్పున బాడుగ పెంచుతూ 25 సంవత్సరాలు లీజుకు ఇవ్వడం జరుగుతుందన్నారు . గుడ్ విల్ కూడా 4 వాయిదాలలో చెల్లించే సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు . గుడ్ విల్ ఆధారంగానే 7.55 కోట్లు సేకరించి నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు . రోడ్డువైపు పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు . రైతులకు , చిరు వ్యాపారస్థులకు గుడ్ విల్ ఉండదని , కేవలం నెలవారీ బాడుగ మాత్రమే ఉంటుందన్నారు .ఈ కూరగాయల నూతన భవన షాపుల నిర్మాణం  ఈ టెండరింగ్ వేస్తామన్నారు.ఆన్ లైన్ ద్వారా ఎవరైనా టెండర్ వేసుకోవచ్చన్నారు.ప్రతిదీ చాలా పారదర్శకంగా చేస్తున్నామని,రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని 1.79 ఎకరాల్లో 27% పార్కింగ్ తో అద్భుతమైన కాయగూరల మార్కెట్ నిర్మించబోతున్నామని తెలిపారు.

అభివృద్ధికి సహకరించండి,అడ్డుపడితే..ఐ డోంట్ కేర్

పట్టణాన్ని అభివృద్ధి పరచే పనులకు,కార్యక్రమాలకు రాజకీయ పార్టీలు,ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి కోరారు.గతంలో తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో రోడ్డు వైండింగ్, ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం భవనాలను కూల్చవలసి వచ్చినప్పుడు చాలామంది వ్యతిరేకించరన్నారు,చాలామంది తనకు దూరం కావడం జరిగిందన్నారు.నాడు వ్యతిరేకించినవారే చేసిన మంచిని గుర్తించారన్నారు.రాజకీయం నా వృత్తి అనీ,రాజకీయ జీవితంలో ప్రజలకు,నియోజకవర్గానికి ఎలాంటి మేలు చేసాం,చేయగలిగామన్నదే ముఖ్యమని అన్నారు.ధర్మవరం పట్టణానికి తాగునీరు,పాలిటెక్నీక్ కళాశాల,ఆసుపత్రులు,పాఠశాలల అభివృద్ధి, రోడ్ల సుందరీకరణ,ఫ్లై ఓవర్ వంతెనలు,మునిసిపాలిటీ ఆదాయం పెంపొందించడం ఇలా ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసి అభివృద్ధి సాధించడం జరిగిందన్నారు.

త్వరలోనే జిల్లేడు బండ ప్రాజెక్ట్ నిర్మాణం,అదే విధంగా 50 పడకల ఆసుపత్రి పూర్తి కానుందన్నారు.ఇవన్నీ తన హయాంలో చేశానని,రాజకీయ వృత్తిలో ప్రజలకు ఇవన్నీ చేశానని గర్వంగా చెప్పగలనన్నారు.ఒక ప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నప్పుడు వారికి మంచి చేసే బాధ్యత ప్రజాప్రతినిధిగా తనకు ఉంటుందని,కేవలం ఓట్ల కోసం,తమ ఉనికిని కాపాడుకోవడం కోసం అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలని,కూరగాయల వ్యాపారులను తప్పుదోవ పట్టించకుండా అభివృద్ధి కి సహరించాలని అన్నారు.అభివృద్ధి పనులకు ఎవరు అడ్డుపడినా సహించేదిలేదన్నారు.

ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్నారు. మంచి చేసారనుకుంటే ఓట్లేస్తారు,ఆదరిస్తారు.అసత్య ప్రచారాలు నమ్మి తనను విమర్శించినా నిజానిజాలు తెలుసుకున్నాకైనా హర్షిస్తారని అన్నారు. ఎన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నామన్నది ముఖ్యం కాదు,మన హయాంలో ప్రజల కోసం,నియోజక అభివృద్ధికోసం ఏం చేసామన్నదే ముఖ్యమని అన్నారు.

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button