Dharmavaram

ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కి సెలెక్ట్ అయిన దేవాంగ ముక్కర పురుషోత్తం

ధర్మవరం (పల్లె వెలుగు) ధర్మవరం పట్టణంలో ని రామ్ నగర్ నందు నివాసముంటున్న దేవాంగ  ముక్కర పురుషోత్తం ఆగస్టు 15/8/21న రష్యాలోని మౌంట్  ఎల్ట్రాస్ పర్వతాన్ని అధిరోహించిన దేవాంగ ముక్కర పురుషోత్తం కి ప్రపంచంలోనే అతి పెద్ద పర్వతం అయినా  ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సెలక్ట్ అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు   డీకే నాగరాజు  వారి స్వగృహంలో ముక్కర పురుషోత్తం ని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు డీకే నాగరాజు మాట్లాడుతూ అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ని ఓ నిరుపేద కుటుంబానికి జన్మించిన దేవాంగ ముక్కర పురుషోత్తం రష్యాలోని మౌంట్ ఎల్ట్రాస్ అధిరోహణకు ఆగస్టు 8/8/21న  రష్యా వెళ్లాలంటే నాలుగు లక్షలు ఖర్చు అవుతుందని దేవాంగ  ముక్కర పురుషోత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు డీకే నాగరాజు గారి దృష్టికి రావడంతో రష్యా వెళ్లడానికి దేవాంగ సంఘం ఆధ్వర్యంలో డీకే నాగరాజు గారి సహకారంతో దేవాంగ పురుషోత్తం కు రష్యా వెళ్లడానికి కావలసిన మొత్తాన్ని సమకూర్చడం  జరిగిందని వారు తెలిపారు అదేవిధంగా దేవాంగ పురుషోత్తం మాట్లాడుతూ రష్యా లోని  మౌంట్ ఎల్ట్రాస్ పర్వత అధిరోహణకు ఆగస్టు 8/8 /21న రష్యాకు వెళ్లేందుకు  దేవాంగ పురుషోత్తం  కుటుంబ ఆర్థిక సమస్యల వలన రష్యాకు వెళ్లాలని ఆశ ఉన్నప్పటికీ  మా కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల నేను రష్యా కు వెల్ల లేను అనుకున్నా నాలోని ఆశలన్నీ వదులుకొని ఉన్నప్పుడు నా ఆర్థిక  సమస్యలను రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు డీకే నాగరాజు గారి దృష్టికి వెళ్ళినప్పుడు వారు నాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు అప్పుడు నాలోని ఆశలు చిగురించాయి నన్ను ముందుకు నడిపించిన నన్ను ముందుకు నడిపించ బోతున్న  మా దేవాంగ సంక్షేమ  సంఘం వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని దేవాంగ   ముక్కర పురుషోత్తం తెలిపారు.

Back to top button