Dharmavaram

పేద విద్యార్థి ఉన్నత చదువులకై ఆత్మీయ ట్రస్ట్ చేయూత

ధర్మవరం (పల్లెవెలుగు)సెప్టెంబర్ 21 ధర్మవరం పట్టణానికి చెందిన ఆత్మీయ ట్రస్ట్ వారు మంగళవారం రోజున అనంతపురం జిల్లా, నార్పల మండలానికి చెందిన ఇ. దిలీప్ కుమార్ అనే పేద విద్యార్థి యొక్క ఉన్నత చదువు కొరకు ఆత్మీయ ట్రస్ట్ తరపున (20 వేల రూపాయలు) చేయూతనిచ్చి సహకారం అందించారు. ఆత్మీయ ట్రస్ట్ ఛైర్మన్ మరియు యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రా రెడ్డి, వైస్ ఛైర్మన్ శెట్టిపి సూర్యప్రకాశ్ రెడ్డి, డైరెక్టర్లు నంగీ పరమేశ్వర రెడ్డి, రాజశేఖర్ రెడ్డి సహాయ సహకారాలతో ధర్మవరం పట్టణం నందు దేవి నర్సింగ్ హోమ్ ఎండి. డా.పద్మ మరియు ఆత్మీయ ట్రస్ట్ వైస్ ఛైర్మన్ శెట్టిపి సూర్యప్రకాశ్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థికి ఇరవై వేల రూపాయల చెక్కును అందజేశారు.  ఈ సందర్భంగా డా. పద్మ మాట్లాడుతూ ఆత్మీయ ట్రస్ట్ , ధర్మవరం వారు రైతు కుటుంబాలకు అండగా నిలవడం, క్రీడాభివృద్ధి కి తోడ్పడటం, పేద విద్యార్థుల ఉన్నత చదువులకై అండగా నిలవడం, ఉచిత వైద్య, రక్త దానం శిబిరాలు నిర్వహించడం, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం,   సమాజ సేవలో తమవంతు సహకారంగా ఆత్మీయ ట్రస్ట్ ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం హర్షణీయమని, అభినందనీయమని ఆత్మీయ ట్రస్ట్ సేవలను కొనియాడారు.

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button