Dharmavaram

విగ్నేష్ కుటుంబానికి అండగా ఉంటాం చిలకం మధుసూదన్ రెడ్డి

ధర్మవరం (పల్లె వెలుగు ) సెప్టెంబర్ 20 అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం రెడ్డి పల్లి గ్రామంలో నివాసముంటున్న రైస్ మిల్ చంద్ర మరియు రమాదేవి కుమారుడు విగ్నేష్ (12)దారుణ హత్యకు గురవ్వడం జరిగింది, ఈ విషయం మీద శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి  మాట్లాడుతూ కనిపించకుండా పోయిన వారి కుమారుడు తండ్రి  చంద్ర  పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ కొడుకు కిడ్నాప్ అయ్యాడు అని ఎంత చెప్పినా కూడా పోలీసులు ఏ మాత్రం స్పందించ లేదన్నారు, ఆ తర్వాత నల్లమాడ మండలం కమ్మవారి పల్లి వద్ద ముళ్ళ పొదల్లోని ఓ బావిలో విగ్నేష్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించడం జరిగింది, విగ్నేష్ ను పాశవికంగా రాళ్లతో కాళ్లు కట్టేసి బ్లేడ్లతో కోసి బావిలో పడేసి హత్య చేసినట్లు వారు తెలిపారు, ఈ విషయం మీద పోలీసులు సరైన సమయంలో స్పందించక పోవడం వల్ల విగ్నేష్ హత్యకు గురయ్యాడు అని విగ్నేష్ తల్లిదండ్రులు తెలియచేశారు, విగ్నేష్  ఇంటి దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే గారి ఇల్లు కేవలం 4 కిలోమీటర్లు ఉంది అయినా కూడా ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమని  ఈ హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకుని శిక్షించాలని శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు పేర్కొన్నారు, అలాగే విగ్నేష్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ తరుపున పోరాడతామని అలాగే ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ సంయుక్త కో కన్వీనర్ శ్రీ ఆకుల ఉమేష్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్ గారు, & అబ్దుల్ అబూ గారు, మరియు ధర్మవరం పట్టణ అధ్యక్షులు అడ్డగిరి శ్యామ్ కుమార్ గారు, జిల్లా సంయుక్త కార్యదర్శి కుళ్లకుంట శేఖర్ గారు, మేకల ఈశ్వర్, వెంకటేష్,లోకేష్ ,పేరురు శ్రీనివాసులు,కోటికి రామంజి, మరియు తదితరులు పాల్గొన్నారు

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button