Dharmavaram

దాబాల్లో యథేచ్ఛగా మద్యం సిట్టింగులు

  • ధర్మవరం దాబాల్లో జోరుగా మద్యం సేవికులు
  • దాబాల్లో నిర్వాహకులు దొంగచాటున మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టు వినికిడి
  • దాబాలపై కానరాని సంబంధిత శాఖ అధికారుల దాడులు
  • మామూళ్ల మత్తులో పోలీసు, ఎక్సైజ్ శాఖలు

ధర్మవరం,సెప్టెంబర్ 16;(పల్లెవెలుగు):పట్టణంలోని దాబాల్లో మద్యం బాబుల సిట్టింగులు జోరుగా సాగుతున్నాయి.  దాబాల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం సిట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. శివారు ప్రాంతంలో దాబాలు ఉండడం,అందులో నిర్వాహకులు రహస్యంగా మద్యం సేవించడానికి అవకాశం కల్పించడం వాహనదారులు కూడా మద్యం సేవిస్తూ అతివేగంగా వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు దాబాల్లో అడపాదడపా తనిఖీలు చేయడం .. నిర్వాహకులు ఇచ్చే మామూళ్లు తీసుకుంటూ చూసీ చూడగలిగేలా ఉంటున్నట్లు విమర్శలు వెలువడుతున్నాయి.

దాబాల్లో జోరుగా మద్యం సిట్టింగ్ చేస్తున్నారు

దాబాల్లో మద్యం తాగడానికి ఎలాంటి అనుమతులు లేవు. గత కొన్ని సంవత్సరాలుగా దాబాల్లో మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. కానీ, ఈ మధ్య కాలంలో దాబాల్లో జోరుగా మద్యం సిట్టింగ్ అవసరమవుతోంది.  మద్యం కేసులను దాబాల నిర్వాహకులు స్థానిక  మద్యం దుకాణాల నుండి మద్యాన్ని తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా కొంత మంది వాహనదారులు మద్యం బాటిళ్లను బయట నుంచి తెచ్చుకొని తాగుతున్నారు. ఆ తర్వాత వారు మద్యం మత్తులో వాహనాలను అతివేగంతో జాతీయ రహదారిపై నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు.

అంతంతమాత్రంగానే పోలీసు, ఎక్సైజ్ తనిఖీలు

 దాబాలలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. దాబాల్లో మద్యం సిట్టింగ్ తరగతులు, మద్యం అమ్మకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత వారిదే. కానీ దాబాల్లో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అధికారులు అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దాబాలోకి పోలీసులు,ఎక్సైజ్ అధికారుల తనిఖీలకు వేళ్తే ఆశాఖలోని వారే దాబాల నిర్వాహకులకు ముందుగానే సమాచారం చేరవేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో  దాబాల నిర్వాహకులు అప్రమత్తం అవుతున్నారు. రాత్రి సమయాల్లో కంటే పగలే దాబాల నిర్వాహకులు మద్యం సిట్టింగ్  జోరుగా కొనసాగిస్తోన్నా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు, చూసీ చూడనంతగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button