Dharmavaram

మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూల మాలలు

ధర్మవరం (పల్లెవెలుగు) సెప్టెంబర్ 15 ధర్మవరం  పట్టణములోని మున్సిపల్ కార్యాలయములో బుధవారం ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఈఈ సత్యనారాయణరావు, ఓఎసి-రిటైర్డ్ డివైఈఈ వన్నూర్స్వామి, ఎఫ్ఎసి డిఈ వాణిలతో పాటు ఏఈలు ప్రతాప్, హరీశ్కుమార్, సిబ్బంది మహమ్మద్ సీఫ్, ప్రియాంకలు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సత్యనారాయణరావు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య  చేసిన సేవలను కొనియాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన కృషి అనన్యనీయమని, దేశం గర్వించదగ్గ ఇంజనీర్ మోక్షగుండం అని ఆయన జయంతి రోజునే ఈ ఇంజనీర్స్ డేను జరుపుకుంటున్నామని తెలిపారు. వారు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి దేశం గర్వించదగ్గ విధంగా ఎన్నో సాంకేతిక కట్టడాలను అందించిన మహావ్యక్తి విశ్వేశ్వరయ్య అని తెలిపారు. ఇంజనీరింగ్, సమాజ అభివృద్ధిలో అపారమైన కృషి, ఆవిష్కరణాల కారణంగా భారతీయ ఇంజనీరింగ్ పితామహుడుగా కూడా పిలువబడుచున్నాడని తెలిపారు. నేటి యువత విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకొని దేశ, సమాజ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు.

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button