Dharmavaram

కూరగాయల మార్కెట్ నూతన భవనాల నిర్మాణం చేపట్టబోతున్నాం-మునిసిపల్ కమీషనర్ మల్లికార్జున – construction of new buildings for the vegetable market

  • అక్టోబర్ 4,5,6 తేదీలలో బహిరంగ వేలంపాట
  • పట్టణ ప్రజలు ఈ అవకాశం సద్వినియోగించుకోండి

ధర్మవరం (పల్లెవెలుగు) 14  సెప్టెంబర్: పట్టణములోని కాయగూరల మార్కెట్‌ను అతిత్వరలో అధునాతన రీతిలో కాయగూరల మార్కెట్ , వాణిజ్య సముదాయంతో కూడిన భవనాలను నిర్మిస్తున్నట్లు మున్సిపల్ కమీషనర్ మల్లికార్జున పేర్కొన్నారు . ప్రభుత్వం నుండీ అన్ని అనుమతులూ వచ్చాయని అన్నారు.ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడిస్తూ మొత్తం 7.55 కోట్ల రూపాలయలతో ప్రజలకు , వ్యాపారస్థులకు అనుకూలంగా ఉండే విధంగా రూపురేఖలను మారుస్తూ భవన వాణిజ్య సదుపాయాలను కల్పించడము జరుగుతోందన్నారు . మొత్తం 146 గదులను నిర్మించడము జరుగుతోందన్నారు . పెరుగుతున్న జనాభా , వర్షములో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అన్ని కాలాలలో సౌకర్యాలు ఉండే విధంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని , పరిపాలనా పరంగా , అన్ని విధాలుగా అనుమతులు , ప్రభుత్వం నుంటి జిఓలు కూడా రావడం జరిగిందన్నారు . గుడ్ విల్ వేలంపాటను అక్టోబర్ నెలలో 4  , 5 , 6 వ తేదిలలో నిర్వహిస్తామన్నారు . 8 నెలలలోపు నిర్మాణ పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు . రిటైల్ కూరగాయాలకు 44 దుకాణాలు కలిగిన షెడ్లు వుంటాయనీ వాటికి గుడ్ విల్ ఉండదని , నెలవారీ బాడుగ మాత్రమే ఉంటుందన్నారు .  హోల్ సేల్ వ్యాపారుల నిమిత్తం 22 షాపులు , వాణిజ్య షాపులు 78 ఉంటాయన్నారు . మొత్తం ఆరు బ్లాకులలో 146 గదులు ఉంటాయన్నారు . ఎస్సీ,ఎస్టీ,రజక,నాయీబ్రాహ్మణ,వికలాంగులకు మొత్తం 36 శాతం రిజర్వేషన్ ప్రకారము,మిగిలిన 64 శాతం ఓపెన్ కేటగిరీలో వ్యాపారస్థులకు గదులు కేటాయించడము జరుగుతుందన్నారు . గుడ్  విల్ లో ఇచ్చే గదులకు 5 సంవత్సరాలకు బాడుగ పెంచడం ఉంటుందని , తర్వాత చట్టప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు 33శాతం చొప్పున బాడుగ పెంచుతూ 25 సంవత్సరాలు లీజుకు ఇవ్వడం జరుగుతుందన్నారు .గుడ్ విల్ కూడా 4 వాయిదాలలో చెల్లించే సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు.గుడ్ విల్ ఆధారంగానే 7.55 కోట్లు సేకరించి నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. రోడ్డువైపు పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు . రైతులకు , చిరు వ్యాపారస్థులకు గుడ్ విల్ ఉండదని , కేవలం నెలవారీ బాడుగ మాత్రమే ఉంటుందన్నారు .ఈ కూరగాయల నూతన భవన నిర్మాణాల వేలంపాటకు సంబంధించి ప్రజలకు తెలియజేసే విధంలో భాగంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయబోతునట్టు ఈ సందర్భంగా తెలిపారు. ఈ అవకాశాన్ని వ్యాపారస్థులు , రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు . ఈ కార్యక్రమములో డిఈ వన్నూర్ స్వామి . టిపిఓ నాగవల్లిలు పాల్గొన్నారు .

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button