Dharmavaram

నూటికి నూరుపాళ్లు వరదాపురం సూరి బీజేపీలోనే వుంటారు,బీజేపీలోనే కొనసాగుతారు

బీజేపీ నాయకులు నిరంజన్ కుమార్ యాదవ్ స్పస్టీకరణ

ధర్మవరం (పల్లెవెలుగు) సెప్టెంబర్ 08: బుధవారం పత్రికా సమావేశం నిర్వహించిన ధర్మవరం పట్టణ బీజేపీ నాయకులు  వైసీపీ పార్టీ నాయకులు చేసిన విమర్శలకు,ఆరోపణలకు,సవాళ్ళకు సమాధానమిస్తూ ఏ ఒక్కరైనా సరే బీజేపీ పార్టీలో చేరిన తర్వాత పార్టీ మార్చరనీ,మా నాయకుడు వరదాపురం సూర్యనారాయణ పార్టీ మారే ప్రసక్తే లేదనీ,వందకు వందశాతం బీజేపీ పార్టీలోనే ఉంటారని,బీజేపీ పార్టీలోనే కొనసాగుతారని ధర్మవరం బీజేపీ నాయకులు నిరంజన్ కుమార్ యాదవ్ స్పస్టీకరించారు. తమ నాయకుణ్ణి 420 అంటే సహించేదిలేదని,ఏ ఆధారం లేకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తే పరువునష్టపు దావా వేయడానికి సిద్ధమని హెచ్చరించారు.మీరు 420 లకు పదవులు ఇచ్చిన మాట వాస్తవమా?కాదా? అంటూ ప్రస్తుతం రెండవ మునిసిపల్ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న వైసీపీ కౌన్సిలర్ పై గతంలో సెక్షన్ 420 నమోదైన ఎఫ్.ఐ. ఆర్ ను పత్రికాముఖంగా చూపించడం జరిగింది.ఈ సమావేశంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు డిష్ రాజు,రాష్ట్ర ఓ బి సి మోర్చా కార్యవర్గ సభ్యులు గొట్లూరు చంద్ర,ఎస్సీ మోర్ఛా బాలి గొల్ల పరమేష్, యువమోర్ఛా నారాయణస్వామి యాదవ్,పామిశెట్టి శివశంకర్,నిరంజన్ కుమార్ యాదవ్,మైనార్టీమోర్ఛా నబిరసూల్,ప్రధానకార్యదర్శులు రాప్తాటిరాము,దుస్సాకిష్టా తదితరులు పాల్గొన్నారు.

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button