Dharmavaram

కరోనా మందు పంపిణీ చేసిన రాజగోపాల్ యువ దళం

ధర్మవరం( పల్లె వెలుగు) సెప్టెంబర్ 6 ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని  ఆనందయ్యా కరోనా నివారణ మందు ను. పంపిణీ చేసినట్లు గడ్డం రాజగోపాల్ యువదళం సభ్యులు తెలిపారు.అందులో భాగంగానే ధర్మవరం నియోజకవర్గంలో ముదిగుబ్బ,తాడిమర్రి,బత్తలపల్లి లో ఆనందయ్య కరోనా నివారణ మందు పంపిణీ పూర్తయిందన్నారు. అదేవిదంగా సోమవారం ధర్మవరం పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కరోనా నివారణ మందు  పంపిణీ చేయడం  జరిగింది .ఈ సందర్భంగా రాజగోపాల్ యువ దళం  వారు మాట్లాడుతూ. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా  కరోనా నివారణ మందు  దాదాపు పూర్తి అయిందని వారు తెలిపారు. అదేవిధంగా . ధర్మవరం పట్టణ ప్రజలకు  రాజగోపాల్ యువ దళం సభ్యులు ఆనందయ్య కరోనా నివారణ మందు గురించి ప్రజలకు వివరంగా వివరించి కరోనా మందు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం రాజగోపాల్ యువదళం సభ్యులు టిప్పుసుల్తాన్, నవీన్, అరిఫ్, ప్రకాష్, పురుషోత్తం, సాయి, పవన్, వెంకటేష్, మురళి, యోగనంద తదితరులు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button