Dharmavaram

కన్నుల పండుగగా ‘అజాదీకా అమృత్ మహోత్సవ్’ సీ.ఆర్.పీ.ఎఫ్.జవాన్ల సైకిల్ ర్యాలీ

ధర్మవరం (పల్లెవెలుగు)సెప్టెంబర్ 4 ధర్మవరం  పట్టణములో శనివారం   సి.ఆర్.పి.ఎఫ్.జవాన్లు  కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన సైకిల్ యాత్రకు    జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వ రాజన్,  జిల్లా ఎస్.పి. పక్కిరప్ప కాగినెల్లి,   సైకిల్ ర్యాలీ చేస్తున్న సి.ఆర్.పి.ఎఫ్ జవాన్ల కు మద్దతును పలికారు. ఇందులో భాగంగానే స్థానిక  శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జవాన్లతో మమేకమై సైకిల్ యాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు. స్వాతంత్ర్య  కోసం ఎంతో మంది దేశ నాయకులు  వారు చేసిన పోరాటాల ఫలితంగా, అలాగే ఎంతో మంది నాయకులు నిస్వార్థంతో , దేశం కోసం ప్రాణాలను సహితం ధారపోసి మన దేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్య మును సాధించి పెట్టారు అని స్మరణకు తెచ్చుకున్నారు.  భారత దేశానికి  స్వాతంత్ర్యం వచ్చి  75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా  గోల్డెన్ జూబ్లీ వేడుకలను  భారత దేశానికి చెందిన సి.ఆర్.పి.ఎఫ్ బలగాలు నిర్వహించ కుంటున్నాయి. అందులో భాగంగానే  సి.ఆర్.పి.ఎఫ్  జవాన్లు  అజాధికా అమృత్ మహోత్సవ  బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులోభాగంగా సి. ఆర్. పి.ఎఫ్  జవాన్లు  కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు  సైకిల్ యాత్ర  నిర్వహించారు. లో ఉన్న  భారత మాజీ రాష్ట్రపతి  దివంగత నేత  అబ్దుల్ కలాం, విగ్రహానికి  కళాజ్యోతి సర్కిల్ లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్  విగ్రహానికి, అలాగే గాంధీ సర్కిల్ లో ఉన్న మహాత్మా గాంధీజి విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రారంభం నుండి ఆఖరివరకు పొడవునా  పాఠశాలల విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సైకిల్ ర్యాలీని తిలకించడానికి పట్టణ ప్రజలు ప్రధాన రహదారి పొడవునా నిలిచియుండి ఈ సైకిల్ యాత్రను ఆసక్తికరముగా తిలకించారు. ఈ యాత్ర పట్టణములో సుమారుగా 5 కిలోమిటర్ల మేర కొనసాగింది. విద్యార్థులు సి.ఆర్. పి.ఎఫ్ జవాన్ల సైకిల్ యాత్రను స్వాగతిస్తూ విద్యార్థులు చెందిన భరత నాట్యం ఎంతగానో ఆకర్షించింది.అలాగే పావురాలు పైకి విడిచిన వైనం ను కూడా ప్రజలను ఆయకట్టు కున్నది. ఈ సైకిల్ యాత్రలో ఎమ్మెల్యే  కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి తో పాటు  మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, చెర్మెన్ లింగం నిర్మల, వైస్ చెర్మెన్ లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, ఉడుముల రామచంద్ర లతో కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button