
Dharmavaram
హెచ్ఐవి పై అవగాహన కార్యక్రమం
ధర్మవరం (పల్లెవెలుగు)సెప్టెంబర్ 3: ధర్మవరం లోని స్థానిక ప్రభుత్వ ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పిడి ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సమస్త వారు కళ మరియు HIV ఎయిడ్స్ పైన వీధి నాటకం రూపంలో అవగాహన కల్పించడం జరిగింది అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించడం జరిగింది HIV సోకిన ప్రతి వ్యక్తికి ART సెంటర్లో ఉచితంగా మందులు ఇస్తారని వాటి ద్వారా జీవిత కాలం పొడిగించుకునే వీలు ఉంటుందని నాటకం రూపంలో తెలియజేశారు ఈ కళా జాతర కార్యక్రమం శక్తి మైత్రి మహిళా సంఘం వారి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్, వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ అరవింద్ పీడీ రాధమ్మ మరియు శక్తి మైత్రి మహిళా సంఘం సిబ్బంది పాల్గొన్నారు