Dharmavaram

CRPF సైకిల్ ర్యాలీకి ఘనస్వాగతం పలికిన కాకతీయ విద్యా నికేతన్ విద్యార్థులు

ధర్మవరం (పల్లెవెలుగు)సెప్టెంబర్ 3 దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు కావస్తుండగా, గోల్డెన్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.  ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోయిన దండియాత్రను గుర్తుచేసుకుంటూ, అదేవిధంగా ఎంతోమంది  గొప్పనాయకులు, అమరవీరుల త్యాగానికి గుర్తుగా ఈ ర్యాలీ ని నిర్వహించడం జరుగుతోంది. సైకిల్ ర్యాలీలో భాగంగా ధర్మవరం విచ్చేసిన CRPF సైన్యానికి కాకతీయ విద్యానికేతన్ కరస్పాండెంట్ శ్రీమతి శెట్టిపి నిర్మలా జయచంద్రా రెడ్డి, డైరెక్టర్లు సూర్యప్రకాష్ రెడ్డి, పద్మ, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు.

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button