
మరిన్ని బస్సు సర్వీసులు ప్రారంభం – డిపో మేనేజర్ మల్లికార్జున
ధర్మవరం (పల్లెవెలుగు)ఆగస్టు 25 ధర్మవరం డిపోలో గతములో కరోనా దృష్ట్యా పరిమితంగా బస్సులను వివిధ ప్రాంతాలకు నడపడం జరిగిందని, కాని కరోనా తగ్గడంతో ఇక నుంచి అనగా గురువారం నుంచి మరిన్ని బస్సు సర్వీసులను పునరుద్ధరించడము జరుగుతోందని డిపో మేనేజర్ మల్లికార్జున బుధవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురంకు ప్రతి 15 నిమిషాలకు, గోరంట్ల, తాడిపత్రి, పులివెందుల, హిందూపూర్లకు ప్రతి అరగంటకు బస్సులు నడుపుతున్నామని తెలిపారు. దూరప్రాంతాలైన శ్రీశైలంకు ఉ దయం 7-15గంటలకు, కర్నూలు ఉదయం 6గం।, 7గం।, 8గం॥లకు, తిరుపతికి ఉ దయం 4-30గం||, మరియు 5-30గంటలకు, బళ్లారి ఉదయం 11-15కు, మరియు మధ్యాహ్నం 12-30గంటలకు, నంధ్యాల ఉదయం 5గంటలకు, ముష్టికోవెలకు ప్రతి గంటకు, నల్లమాడ ఉదయం 8గం।, సాయంత్రం 5 గంటలకు, కంబదూరు ఉదయం 9గంటలకు, క్రిష్ణాపురం ఉదయం 5-45కు, మధ్యాహ్నం 3-30గంటలకు, చిగిచెర్ల మీదుగా అనంతపురంకు ఉదయం 6గం॥, 9-30గం।, మధ్యాహ్నం 12-30గం।, 3-30గం।, సాయంత్రం 6-30గంటలకు బస్సులు ప్రతిరోజు వెళ్లడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నార్సింపల్లి, పుల్లేటిపల్లి, నాగసముద్రంలకు స్కూల్ బస్సులను నడపడం జరుగుతోందన్నారు త్వరలో ఒంటికొండ, సిద్దరాంపురం, రామగిరి వరకు బస్సులను నడుపుతామని తెలిపారు. కోవిడ్ నిబంధనలతో ప్రయాణీకులు బస్సును ఎక్కాలని వారు తెలిపారు.