
Dharmavaram
డాక్టర్ శర్మ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఆర్డిటి సెక్యూరిటీ గార్డ్ వీరప్ప
ధర్మవరం (పల్లె వెలుగు) ఆగస్ట్ 25 అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం కేంద్రంలోని ఆర్ డి టి హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న వీరప్ప ప్రశంసా పత్రం అందుకున్నారు ఈ సందర్భంగా వీరప్ప మాట్లాడుతూ డాక్టర్ శర్మ చేతుల మీదగా ప్రశంసా పత్రం అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని వీరప్ప తెలిపారు అదేవిధంగా కరోనా సమయంలో బత్తలపల్లి ఆర్ డి టి హాస్పిటల్ లో ఎమర్జెన్సీ పేషెంట్లకు రక్తం అవసరమైనప్పుడు తన స్నేహితుల ద్వారా రక్తం అవసరమైన పేషెంట్లకు అందించేవారు ఇది గమనించిన డాక్టర్లు తోటి సెక్యూరిటీ గార్డులు వీరప్పన్ ను ఎంతగానో అభినందించారు