
పట్టణంలో పలుప్రాంతాల్లో.విచ్చలవిడిగా సంచరిస్తున్న పందుల పట్టివేత
ధర్మవరం,ఆగస్టు 25;(పల్లెవెలుగు): పట్టణంలో బుధవారం మున్సిప ల్ అధికారులు, స్థానిక పోలీసు అధికారులు ఆధ్వర్యంలో పందులను వెంటాడి పట్టుకున్నా రు. కొన్ని నెలలుగా ధర్మవరం పట్టణంలో పందుల బెడద ఎక్కువగా ఉందని ప్రజల నుండీ విమర్శలు వస్తున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పందులను పట్టివేత కార్యక్రమాన్ని నిర్వహించారు.పందుల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని పూర్తిగా పందుల నిర్ములన అయ్యే వరకూ పందులు పట్టుకునే చర్య కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. పందులను పట్టుకునే ప్రత్యేక బృందాన్ని తెప్పించి జగ్జీవనరాం వీధి, పాతబస్టాండ్,మెయిన్ బజారు,తదితరచోట్ల దాదాపు 120 పందులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మునిసిపల్ కమీషనర్ ఆదేశాల మేరకు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తమ సిబ్బందితో పందుల నిర్ములన కార్యక్రమం చేపట్టామన్నారు. పందుల పెంపకందారులు వాటిని ఊరికి దూరంగా ఉంచాలన్నారు.