
అవినీతి కి బ్రాండ్ వరదాపురం సూరి గుర్రం శ్రీనివాసరెడ్డి.వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి
ధర్మవరం (పల్లె వెలుగు) ఆగస్టు 22 ఆదివారం స్థానిక వైస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వైస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. వరదపురం సూరి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అనీ, ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు వరదాపురం సూరి తను 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదని వై ఎస్ ఆర్ సి పి గుర్రం శ్రీనివాసులు తెలిపారు ఆయన మాట్లాడుతూ ,కనీసం ఒక్క శాశ్వతమైన ప్రజాప్రయోజన పని చేసిన దాఖలాలు లేవని అన్నారు. అదేవిధంగా రదపురం సూరి ఒక వ్యాపారస్తుడనీ, తన కాంట్రాక్టులు,పనులు చక్కదిద్దుకోడానికి రాజకీయాల్లోకి వచ్చాడని,ఇలాంటి వాళ్ళు ప్రజలకు సేవ చేయరని,ప్రజలు ఎవరూ ఇలాంటి వారిని నమ్మవద్దని అన్నారు. గత టిడిపి హయాంలో వరదాపురం సూరి ని నమ్ముకుని ఉన్న తన కార్యకర్తలను నట్టేట ముంచి బీజేపీలోకి తన స్వార్థాల కోసం వరదాపురం సూరి వెళ్లారని అంతేగాక ధర్మవరం నియోజకవర్గంలో టిడిపి పార్టీని నమ్ముకుని ఉన్న టిడిపి కార్యకర్తల సమస్యలు ఎవరికి చెప్పాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని గుర్రం శ్రీనివాసులు తెలిపారు అంతేగాక ఇతరుల మీద బురద చల్లాలని చూస్తే ప్రజలు అమాయకులు ఎవరు లేరని ఆయన తెలిపారు. అంతేకాక తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పనుల్లో జరిగిన అక్రమాలను బయటపడుతున్నాయని తెలిపారు . అంతేకాకుండా తనను నమ్ముకున్న తెలుగు తమ్ముళ్లను, కార్యకర్తల్ని, పార్టీని నట్టేటముంచి పార్టీ ని వీడి వెళ్లిపోయాడన్నారు. కేవలం తన వ్యాపార అభివృధ్ధికోసమే బీజేపీ చెంత చేరాడని అన్నారు. అదేవిధంగా సూరి హాయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ఈ ఉపాధిహామీ పనుల్లో బైటపడుతున్నాయని అన్నారు.రాబోయే రోజుల్లో వరదాపురం అవినీతి అక్రమాల సినిమా తీస్తామని అన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి’గుడ్ మార్నింగ్’ కార్యక్రమం లో భాగంగా ప్రతిరోజు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం,పరిష్కరించడం చేస్తూ మన్ననలను పొందుతూ ఉన్నారని ఆయన తెలిపారు.దీన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు నిందారోపణలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రజా సేవ చేసే వ్యక్తి తప్ప అక్రమాలకు పాల్పడే వ్యక్తి కాదని గుర్తించే ఆయన్ను ఎమ్మెల్యే గా గెలిపించారన్నారు.ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్యాయ, అక్రమాలు చేసి ఉంటే ప్రజల మధ్యలో కి ధైర్యంగా వెళ్ళలేరు అని ఆయన తెలిపారు. అదేవిధంగా అభివృద్ధికి మారుపేరైన కేతిరెడ్డి పై ఒక్క ఆరోపణ రుజువు చేస్తే రాజకీయలనుండీ తప్పుకుంటానన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్నవారు. సర్పంచ్ నాగానంద రెడ్డి వెంకట రామా రెడ్డి మల్ల కాల్వ మురళి కనగానపల్లి రవీంద్రారెడ్డి తుంపర్తి కృష్ణారెడ్డి కత్తి కొట్టాల కృష్ణ పోతుల నాగేపల్లి శివారెడ్డి బెల్లంపల్లి హరి గొట్లూరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు