
అవినీతికి పాల్పడిన ఇద్దరు వార్డు వాలంటీర్ లను విధులనుండి తొలగించిన ధర్మవరం మున్సిపల్ అధికారులు
ధర్మవరం,ఆగస్ట్ 22;(పల్లెవెలుగు): అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని స్థానిక 1వ వార్డు లో విధులు నిర్వహిస్తున్న సువర్ణ మరియు వై లక్ష్మి అనే వార్డు వాలంటీర్లను అవినీతికి పాల్పడడం తో తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తెలిపారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆదేశాలతో ఇద్దరు వార్డు వాలంటీర్ ల పై వార్డు పరిధిలో విచారణ జరపగా 1వ వార్డు పరిధిలో నేతన్న నేస్తం లబ్ధిదారులను డబ్బులు డిమాండ్ చేసినట్లు తమ విచారణలో తేలిందని కమిషనర్ మల్లికార్జున తెలిపారు. ఒక్కో లబ్ధిదారుని నుండి రెండు వేల రూపాయల వరకు డిమాండ్ చేసినట్లు అధికారులు విచారణలో తేలడంతో వారిని విధుల నుండి తొలగిస్తున్నట్లు ఆదివారం నాడు ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపాలిటీ పరిధిలో ఏవైనా సంక్షేమ పథకాల వర్తింపు కోసం వార్డు వాలంటీర్లు గానీ, సచివాలయ ఉద్యోగులు గానీ డబ్బులు డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు అందిస్తే తక్షణమే వారిని విధుల నుండి తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు.