
దోమల ద్వారా వచ్చే వ్యాధులను నిర్మూలిద్దాం
ధర్మవరం (పల్లెవెలుగు) ఆగస్టు 20 ధర్మవరం పట్టణం లోని దోమల ద్వారా వచ్చే వ్యాధులను తగిన జాగ్రత్తలతో నిర్మూలించవచ్చునని సబయూనిట్ మలేరియా అధికారి జయరాంనాయక్ పేర్కొన్నారు.. ‘ఈ సందర్భంగా శుక్రవారం ధర్మవరం పట్టణములో ప్రభుత్వ ఆసుపత్రి నుండి పలు కూడలీల ద్వారా ర్యాలీని నిర్వహించారు. అనంతరం జయరాంనాయక్ తో పాటు డాక్టర్ వెంకటేశు లు, డాక్టర్ నాగజ్యోతి, డాక్టర్ శ్రీలత, డాక్టర్ జయప్రకాశలు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల కాలంలో దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఇంటిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అంతేకాకుండా ఇంటివద్ద నీటితొట్టెలలో నీటిని ఎక్కువరోజులు నిల్వ ఉంచకుండా రెండు, మూడు రోజులకు ఒకసారి పారేయాలన్నారు. రాత్రి సమయాలలో దోమతెరలు తప్పక వాడాలన్నారు. ఆడదోమ ద్వారా మలేరియా, పులిదోమ ద్వారా డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు, మురికి కాలువలో ఉండు దోమద్వారా బోధకాలు, పందుల ద్వారా 2సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వయస్సు కలవారికి మెదడువాపు వ్యాధులు వస్తాయని తెలిపారు. అప్రమత్తంగా లేకపోతే ప్రాణాపాయం తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమములో ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎంలు, నర్సులు పాల్గొన్నారు.