ఉరి వేసుకున్న మహిళ

ధర్మవరం (పల్లెవెలుగు)ఆగస్టు 20 ధర్మవరం రూరల్  రేగాటిపల్లిలోని బిసి కాలనీలో శుక్రవారం ఉదయం కాటమయ్య భార్య మాలగుండ్ల మల్లేశ్వరమ్మ (34) ఇంట్లో ఎవరూలేని సమయాన చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మల్లేశ్వరమ్మ, కాటమయ్య 20సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలదు. ఏమి జరిగిందో ఏమో కాని శుక్రవారం ఉదయం పొలంపనీమీద భర్తతో పాటు తన పిల్లలు వెళ్లిపోయారు. ఇదే అదనుగా చూసుకొని మృతురాలు మల్లేశ్వరమ్మ చీరతో ఉరివేసుకుంది. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన భర్త, పిల్లలు వాకిలి తెరవగా ఉరివేసుకున్న దృశ్యం కనపడగా బోరున విలపించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది . రూరల్ ఎస్ఐ ప్రదీప్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.