Dharmavaram

నాడు-నేడు కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో సువర్ణధ్యాయం – ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

ధర్మవరం,ఆగస్టు 16;(పల్లెవెలుగు):  నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. సోమవారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమాన్ని  ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్వయంగా బైక్ నడుపుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కి వెళ్లి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక బి ఎస్ ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ..

ఒకప్పుడు శిధిలమైన భవనాలు, పెచ్చులూడిన గచ్చులు, విరిగిపోయిన బల్లలు, వర్షం పడితే విద్యార్థులంతా ఒక మూల కూర్చునేలా కురుస్తున్న గదులతో ప్రభుత్వ పాఠశాలలు దర్శనమిచ్చేవి. పాఠశాలలలో అపరిశుభ్ర వాతావరణం ఉండేది. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితులు విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసేవి. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చదువుకోవడం అంటేనే అరకొర వసతులతో చదువుకోలేని ఇబ్బందికర పరిస్థితులు ఉండేవన్నారు. కానీ ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ లుక్ సొంతం చేసుకున్నాయి. పాఠశాలల రూపురేఖలు మార్చడంతో నూతన ఒరవడిని సృష్టించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఉన్న పాఠశాలల స్వరూపానికి, ఇప్పుడు పాఠశాల స్వరూపానికి తేడాను స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చేసి చూపించారు.

విద్యా ప్రమాణాల మెరుగుదలకు జగన్నన్న ప్రభుత్వం పెద్దపీట

పాఠశాలల్లో విద్యార్థులకు గాలి, వెలుతురు దారుణంగా వచ్చేలా తరగతి గదులు, బ్లాక్ బోర్డ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా గార్డెన్స్, ప్లే గ్రౌండ్స్, అపరిశుభ్ర వాతావరణం లేకుండా ఉండేలా టాయిలెట్స్ ఇలా ఒకటేమిటి సర్వాంగ సుందరంగా పాఠశాలలు ముస్తాబయ్యాయి. దేశానికి ఎంతో మంది ప్రముఖులను, మంత్రులను అందించిన అనేక ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకుని అభివృద్ధికి నోచుకోక, దయనీయమైన పరిస్థితుల్లో దర్శనమిచ్చేవి. కానీ అలాంటి పాఠశాలలకు సైతం జగన్ సంకల్పంతో మోక్షం లభించింది. అన్ని స్కూల్స్ అందంగా ముస్తాబవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలతో, పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన జగన్ అడుగడుగున విద్యార్థులకు కావలసిన వసతులను సమకూరుస్తూ ఏపీలో విద్యార్థులను సర్కారీ బడి బాట పట్టిస్తున్నారు.

మొదటి విడతలో కార్పోరేట్ స్కూళ్లను తలపించే విధంగా 15,715 స్కూల్స్

రాష్ట్ర వ్యాప్తంగా 44,512 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడానికి రంగంలోకి దిగిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి విడతగా 15,715 పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో రూపురేఖలు మార్చేశారు. అధునాతన సౌకర్యాలతో, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల భవనాలను మార్చేశారు. మొత్తం 15,715 పాఠశాలలకు 3,585 కోట్ల రూపాయలను కేటాయించి అభివృద్ధి చేశారు. పాఠశాలల భవనాలను రిపేర్ చేయించడమే కాకుండా, ఆధునికత ఉట్టిపడేలా, విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా చాలా అందంగా తీర్చిదిద్దారు. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించడానికి కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా అయితే పాఠశాలలను రెడీ చేస్తున్నాయో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను సైతం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారని అన్నారు.రాష్ట్ర చరిత్రలో విద్య-వైద్యం పై ప్రత్యేక దృష్టిసారించి అత్యధిక బడ్జెట్ కేటాయించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఆయన అన్నారు.

గత ప్రభుత్వం చై-నా (చైతన్య-నారాయణ)లకే ధరాదత్తం

టిడిపి ప్రభుత్వ హయాంలో  ప్రభుత్వ పాఠశాలలు ను నిర్వీర్యం చేసి కార్పొరేట్ పాఠశాల లైన నారాయణ, చైతన్య, భాష్యం, తదితర కార్పొరేట్ పాఠశాలలకు దారాదత్తం చేశారని అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే విద్య, వైద్యం సామాన్య ప్రజలందరికీ  అందుబాటులోకి తేవాలన్న దృఢ సంకల్పంతో  నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ను ప్రక్షాళనం చేసి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారని  ప్రతి పాఠశాలలోనూ త్రాగునీరు, బెంచీలు, తదితర అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించడంతోపాటు జగనన్న విద్యా కానుక ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, బూట్లు తదితర వస్తువులు అందించడంతో పాటు జగనన్న గోరుముద్ద ద్వారా  నాణ్యమైన  పౌష్టికాహారాన్ని అందజేయడం జరుగుతోందన్నారు. దేశంలోనే నాడు నేడు కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా మారిందన్నారు. ప్రతి ఏడాదికి  ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగడంతోపాటు, రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో డిమాండ్ పెరుగుతోందన్నారు.

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button