Dharmavaram

 రమ్యను హత్య చేసిన దుండగులను – వెంటనే బహిరంగంగా ఉరి తీయాలి – AISF, AISB, SFI,MSF

ధర్మవరం (పల్లెవెలుగు)ఆగస్టు 15  ధర్మవరం పట్టణంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు కొవ్వొత్తుల నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ   దళితులపైన నిత్యం హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న ఈ రాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే ఆగస్టు 15 న కూడా దళితులపై హత్యాకాండలు ఆగలేదు. ఉదయం 10 గంటలకు  జాతీయ జెండా ఎగరవేసే సమయంలోనే…. గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థినిపై అత్యంత దారుణంగా దాడి చేసి కత్తితో పొడిచి, పొడిచి, చంపిన దుర్ఘటన జరిగింది. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ సంఘటన  ఇప్పటికైనా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి హత్య చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని. ఐక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం  లేని పక్షాన విద్యార్థి యువజన సంఘాలు ఐక్యమై రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో   AISB  రాష్ట్ర సహాయ కార్యదర్శి సాకే హరికుమార్, AISF  డివిజన్ ప్రధాన కార్యదర్శి పోతలయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నామాల నాగార్జున, ఎం ఎస్ ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పాపిరెడ్డి పల్లి పృద్వి,  ఎస్ ఎఫ్ ఐ    నాయకులు   బిల్లే జగదీష్,  AISB డివిజన్ ప్రధాన కార్యదర్శి బండారు అనిల్ కుమార్, నాయకులు, నఫీజ్ అహ్మద్, మంజు, తదితరులు పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks