Dharmavaram

ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి-మునిసిపల్ కమీషనర్

ధర్మవరం (పల్లెవెలుగు) 14 ఆగష్టు: ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పిలుపు మేరకు ‘స్వచ్ఛ సంకల్పం-స్వచ్ఛ ధర్మవరం’ పేరిట ఆగస్టు 15 న స్థానిక కాలేజి గ్రౌండ్ నందు జరుగనున్న వ్యర్థ ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మునిసిపల్ కమీషనర్ మల్లికార్జున ప్రజలందరికీ పత్రికాముఖంగా తెలియజేసారు. పట్టణంలోని ప్రతి కుటుంబం తమతమ ఇళ్ళల్లోని  వ్యర్థ ప్లాస్టిక్ ను స్థానిక వార్డు వాలేంటీర్ లేదా ఆర్పీ లకు అందించాలని వారు అందుబాటులో లేకపోతే కాలేజి క్రీడమైదానంలో ‘ఆగస్టు 15 న జరుగనున్న’నో ప్లాస్టిక్ ఉద్యమంలో’పాల్గొని ఆ ప్లాస్టిక్ చెత్తని అక్కడ అందివ్వాలని కోరారు. అదేవిధంగా పట్టణంలోని వ్యాపారస్తులు కూడా నిషేధిత ప్లాస్టిక్ కవర్లు తమ వద్ద ఉంటే స్వచ్ఛందంగా ఈ ఉద్యమ ముఖంగా అందించి పర్యావరణ కాలుష్యాన్ని కాపాడం కోసం పెద్ద ఎత్తున తలపెట్టనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు. రేపటినుండీ ‘ప్లాస్టిక్ వెస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ రూల్స్’ అమలు చేస్తామని 50 మైక్రానులు కంటే తక్కువ మందంగా ఉన్నవి అమ్మకూడదు,వాడకూడదు అన్నారు.పర్యావరణానికి హానికలిగించే ఈ ప్లాస్టిక్ కవర్లు కలిగి ఉన్నవారిపై చట్ట ప్రకారం అపరాధ రుసుము వసూలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఈ నో ప్లాస్టిక్ ఉద్యమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

khadar

Khadar Reporter Dharmavaram, Saityasai dist
Back to top button