Dharmavaram

నంద్యాల వి5 విలేకరి కేశవ హత్య నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి

జివిఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్ డిమాండ్

ధర్మవరం( పల్లెవెలుగు)ఆగస్టు 12 కర్నూలు జిల్లా నంద్యాలలో వి ఫై విలేకరిగా పనిచేసి ఎంతో మంది ప్రజలకు తనదైన శైలిలో వార్తలు విన్నవిస్తూ శాంతియుతంగా పనిచేసిన విలేకరిని అతి కిరాతకంగా హత్య చేయడం చాలా దారుణమని దీన్ని GVSS తీవ్రంగా ఖండిస్తోంది అని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ తెలియజేశారు. హత్య చేసిన నిందితులను అసలు ఉపేక్షించే రాదని అలాగే ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్నటువంటి అన్ని రంగాల విలేకరులను రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విలేకర్ల కి ప్రాణ హాని లేకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన హెచ్చరించారు. విలేకరి కేశవ హత్య నిందితులను వెంటనే కఠినంగా శిక్షించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి కేశవ కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

Back to top button