Sri Sathya Sai

ఉర్దూ పాఠశాలలను ఎత్తేసెందుకు ఎత్నిస్తున్న విద్యా శాఖ

ఉర్దూ పాఠశాలలను ఎత్తేసెందుకు ఎత్నిస్తున్న విద్యా శాఖ

కదిరి (ఆంధ్రప్రతిభ) 24 మే: రాష్ట్రం లోని ఉర్దూ పాఠశాలలను ఎలాగైనా శాశ్వతంగా ముసేందుకు పాఠశాలల మ్యాపింగ్  లో రోజుకో కొత్త నిబంధన చేరుస్తున్నారని, ఒక వైపు ప్రభుత్వం ఉర్దూ భాష ను రెండో అధికార భాష హోదా కల్పిస్తే , ప్రభుత్వ  ఉద్దేశాలకు విరుద్ధంగా రాష్ట్ర విద్యా శాఖ మాత్రం ఉర్దూ మీడియం,  సెక్షన్ పాఠశాలలను ఎత్తేసెందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షలు డాక్టర్ అబ్దుల్ వారిస్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం శ్రీ సత్యా సాయి జిల్లా కదిరి పట్టణం లోని  పురపాలక ఉర్దూ మెయిన్ ఉన్నత పాఠశాలలో అనంత , శ్రీ సత్యా సాయి జిల్లాల రూట శాఖల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యా శాఖ కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ 19/01/2022  నాడు ఆర్ సి నంబర్ ఈఎస్ఈ 02-13/90/2021- ఈ ఎస్ టి 3- సిఎస్ఈ లో మైనర్ మీడియం ఉర్దూ , తమిళ్, కన్నడ ఒరియా పాఠశాలలను కేవలం ఆ పాఠశాలలలోనే విలీనం చేయాలని స్పష్టంగా ఆదేశించినప్పటికి కింది స్థాయి అధికారులు మాత్రం వక్ర నిభందనలు, నియమాలు తెర పైకి తెస్తున్నారని మండిపడ్డారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు  మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఉర్దూ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలైన ఉర్దూ రెండో అధికార భాష , మైనారిటీ సబ్ ప్లాన్ లో భాగంగా మరింత అభివృద్ది చేయాల్సిన పోయి తెరవెనుక పక్కా ప్రణాళిక తో ఉర్దూ పాఠశాలలను శాశ్వతంగా మూసేసెందుకు ఎత్నిస్తున్నరన్నారు. ఈ కార్యక్రమంలో రూట రాష్ట్ర నాయకులు అసోసియేట్ అధ్యక్షులు షాహిదుల్లా ,రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తార్ ఫైజి , ఫైరోజ్ అహ్మద్ ,సమన్వయ కర్త ముహమ్మద్ అయ్యూబ్, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రెటరీ  అసాదుల్లా బాషా, వై ఎస్ ఆర్ కడప జిల్లా  ప్రధాన కార్యదర్శి సయ్యద్ సిబాతుర్ రహ్మాన్ , డైరీ కమిటీ చైర్మన్ హాజీ అబ్దుల్ హకీమ్ ,కో చైర్మన్ సయ్యద్ సిరాజుద్దిన్ ,అనంతపురం జిల్లా అధ్యక్షులు జావేద్ అహ్మద్,  కార్య నిర్వాహక అధ్యక్షులు ఎం. అబ్దుల్ మాలిక్, ప్రధాన కార్యదర్శి  ఫజ్లుల్లాహ్ ,కోశాధికారి  హబీబుర్ రహ్మాన్,  కదిరి రీజనల్ శాఖ నాయకులు ఆరిఫ్ అమీని, వాజిద్, హిందూపురం రీజనల్ శాఖల నాయకులు ఖాజా వలి, అనీస్, మసివుల్లాహ్, అతావుల్లాహ్, అన్నమయ్య జిల్లా శాఖ నాయకులు సమీవుల్లాహ్, సజ్జాద్ అధిక సంఖ్య లో అనంత, శ్రీ సత్యా సాయి జిల్లాల ఉర్దూ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ సత్యసాయి మరియు అనంతపురం జిల్లా శాఖల కు ఎన్నికల అధికారి కే. ఫైరోజ్ అహ్మద్ నూతన కార్యవర్గానికి ఎన్నిక నిర్వచించారు.

chiranjeevi

Chiranjeevi Dharmanvaram Satya Sai Dist, Andhra Pradesh
Back to top button
Enable Notifications    OK No thanks