panyamDattu

పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాలలోనే కలపాలి, అఖిల పక్ష పార్టీల సమావేశంలో తీర్మానం

పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాలలోనే కలపాలి, అఖిల పక్ష పార్టీల సమావేశంలో తీర్మానం

  • పాణ్యం , గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో కలిపేంత వరకు పోరాడుతాం
  • స్వార్ధ ప్రయోజనాలు పక్కనపెట్టి , ఈ రెండు మండలాల అభివృద్దికి దోహదపడాలి.
  • త్వరలోనే ఐదువేల మందితో పాణ్యంలో బహిరంగ సభ నిర్వహిస్తాం.

పాణ్యం (పల్లెవేలుగు) మంగళవారం 1 ఫెబ్రవరి: పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలోనే కలపాలని కోరుతూ మంగళవారం పాణ్యంలో అంబెడ్కర్ సెంటర్ నందు నిర్వహించిన అఖిల పక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ పార్టీల నాయకులు బీజేపీ, టీడీపీ, వామపక్ష సంఘాలు, విద్యార్ధి , యువజన నాయకులు  రైతులు , స్థానిక నాయకులు హాజరయ్యారు. ఈ అఖిల పక్ష పార్టీల సమావేశానికి విద్యార్ధి , యువజన సంఘాల సీనియర్ నేత రామినేని రాజునాయుడు అథ్యక్షత వహించారు. ఈ సందర్బంగా వివిధ పార్టీల నేతలు రామినేని రాజునాయుడు , వెంకటాద్రి , రామ్మోహన్ నాయుడు , రమణ మూర్తి , బీజేపీ సిమెంట్ శ్రీను , దేవదత్తు , బీజేపీ శంకరయ్య , శివకృష్ణ యాదవ్ , రవీంద్ర నాధ్ , గద్దల సామేలు , ప్రతాప్ , స్వాములు , రియాజ్ , కేజే శ్రీనివాసులు , రామకృష్ణ , కొండజూటూరు మాజీ సర్పంచు నారాయణ , పాణ్యం ఎంపీటీసీ రంగరమేష్ , గురునాధ్ , చిందుకూరు దేవశంకర్ , అయ్యపురెడ్డి , కొండజూటూరు కేశవ్ , మొరార్జీ , పిన్నాపురం నాయుడు , బాలరాజు  , జీవీఎస్ రవీంద్ర నాయక్  తదితురులు మట్లాడుతూ పాణ్యం , గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో కలిపి ఏర్పాటు చేసేంత వరకు పోరాటం సాగిస్తామన్నారు. స్వార్ధ ప్రయోజనాలు పక్కన పెట్టి మండలాల అభివృద్దికై పాటుపడాలన్నారు. అనంతరం వారు కార్యచరణ ప్రకటించారు. 2వ తేదీ పోస్ట్ కార్డ్ ఉధ్యమం. 3న తేదీ పాణ్యంలో అర్ధనగ్న ప్రదర్శన. 4వ తేదీ ఎంఆర్ఓ కార్యాలయం మట్టడి. 5వ తేదీ నేషనల్ హైవేపై రాస్తారోకో 6వ తేదీ పాణ్యంలో వంటావార్పు 7వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. 8వ తేదీ పాణ్యంలో భారీ బహిరంగ సభ అనంతరం స్ధానిక ఎంఆర్ఓ కార్యాలయ అథికారిని వినతిపత్రాన్ని అందజేశారు.

Back to top button