Dattupanyam

స్వాతంత్య్ర సమరయోధుల సేవలు చిరస్మరణీయం

పాణ్యం (పల్లెవెలుగు) 2 అక్టోబర్: శనివారం మండల లోని పలు ఆఫీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మన జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతి మరియు స్వాతంత్ర్య  సమర యోధులు లాల్ బహాదుర్ శాస్త్రి జయంతి సందర్బంగా పూల మాలలు వేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల రెవెన్యూ అధికారులు రత్నసాధికా యమ్.ఇ.ఓ కోటయ్య మాట్లాడుతూ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మన జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతి మరియు లాల్ బహూదూర్ శాస్త్రి జయంతి సందర్బంగా వారి  చిత్ర పటాలకు పూల మాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈ సందర్బంగా రెవెన్యూ అధికారి రత్న సాధికా, యమ్.ఇ.ఓ కోటయ్య మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని అన్నారు

Back to top button