Dattupanyam

బిజెపి విధివిధానాల నుండి భారత దేశాన్ని కాపాడుకుందాం వివిధ ప్రజా సంఘనాయకులు

పాణ్యం (పల్లెవెలుగు) 27 సెప్టెంబర్: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడి దారులకు ధారాదత్తం చేస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాల నుండి భారత దేశాన్ని కాపాడుకుందాం అంటూ భారత్ బంద్ లో భాగంగా మండల కేంద్రమైన పాణ్యం లో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు సిపిఎం, సిఐటియు, రైతు సంఘం, ఆటో, హమాలీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువజన సంఘం, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఆర్విఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం బస్టాండ్ ఆవరణలో రాస్తారోకో నిర్వహించి, నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి భాస్కర్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పెరుగు శివ కృష్ణ యాదవ్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటాద్రి, ఆర్.వి.ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ప్రతాప్, గురునాథ్ మాట్లాడుతూ రైతులకు నష్టపరిచే చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులకు నష్టం కలిగించే చట్టాలను రద్దు చెయ్యాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు వెంకట్, తిక్క స్వామి,గోవిందు, హమాలి యూనియన్ నాయకులు భూపాల్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Back to top button