Dattupanyam

పెరిగిన ధరలను అదుపులో ఉంచి  అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనo 21000 ఇవ్వాలి

 సీఐటీ యూకార్యదర్శి భాస్కర్

పాణ్యం (పల్లెవెలుగు) 24 సెప్టెంబర్: శుక్రవారం మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయం నందు సిఐటియు మండల కార్యదర్శి భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్వాడి స్కీం వర్కర్లు, ఆశలతో కలిసి ధర్నా నిర్వహించి, నిరసన తెలియజేసి డిప్యూటీ తాసిల్దార్ మల్లికార్జున్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల్లో పనిచేసే వారందరినీ వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సదుపాయాల కల్పించాలన్నారు. స్కీములు అన్నింటిని సంస్థాగతం చేసి స్క్రీన్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్ల అందరికీ రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ప్రజావ్యతిరేక వ్యవసాయ చట్టాలు మరియు కార్మిక వ్యతిరేక లేబర్ కోర్టు రద్దు చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య, విద్యా, పోషకాహార సర్వీసుల ప్రైవేటీకరణ విరమించాలని, నూతన విద్యా విధానం రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాలు వెంకటమ్మ, అనసూయ, శ్యామల, స్వరూప, ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు పుల్లమ్మ, సుశీల తదితరులు పాల్గొన్నారు.

Back to top button