Dattupanyam

శాంతి రాం ఫార్మసీ లో  “ఫిట్ ఇండియా ఫ్రీడం రన్‌”

పాణ్యం (పల్లెవెలుగు) 13 ఆగష్టు: మండలం లోని శాంతి రామ్ పార్మాసి కాలేజ్ లో  75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఫిట్‌ ఇండియా ఉద్యమంపై అవగాహన కల్పించేందుకు ఆగస్ట్‌ 13వ తేదీన  “ఫిట్‌ ఇండియా ఫ్రీడం రన్‌” కార్యక్రమాన్ని శాంతి రాం ఫార్మసీ కళాశాల లో నిర్వహించారు. ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఏర్పాటు చేసిన ర్యాలీ ని హెచ్ ఓడీలు డా ఆర్ ఈ యుగంధర్..డా ఎం శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…దేశ వ్యాప్తంగా744 జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి 75ం గ్రామాలు, 30,000 విద్యాసంస్థల్లో ఫిట్‌నెస్ ఫ్రీడం రన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్నారు.అక్టోబర్ 2వ తేదీ వరకూ ఫిట్ ఇండియా క్యాంపైన్ నడుస్తుందన్నారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి 100 వ స్వాతంత్ర్య దినోత్సవం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు.25 ఏళ్ళలో దేశ యువత ప్రజలు కోరుకునే మార్పు ను తెలుసుకోవడమే కార్యక్రమ లక్ష్యమని అన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks